Politician :వచ్చే సార్వత్రిక ఎన్నికలను వైసీపీ అధినేత జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ నాయకులను…. ప్రజా ప్రతినిధులకి పలు కార్యక్రమాలు ఇస్తూ నిత్యం ప్రజలలో ఉండే విధంగా దిశ నిర్దేశం చేస్తున్నారు. “గడపగడపకు మన ప్రభుత్వం” వంటి కార్యక్రమం ఇచ్చి ఎమ్మెల్యేల పనితీరు పై ఎప్పటికప్పుడు సర్వే…కూడా చేయించుకుంటున్నారు. ప్రజలలో ఉండకపోతే ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోపోతే వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులను టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ కరాకండిగా చెప్పేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క ప్రజలలోకి వెళ్తున్న వైసిపి ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఈ రకంగానే కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఓ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెళ్ళిన గ్రామంలో ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. పథకాలు ఇంకా అనేక విషయాల గురించి వివరిస్తున్న క్రమంలో ఓ వృద్ధురాలు మండిపడింది. ఎందుకు డబ్బులు పథకాల రూపంలో ఇవ్వడం. దానికి రెండింతలు రేట్లు పెంచేసి మా దగ్గర లాకోవడం అని ఎమ్మెల్యే పై మండిపడింది. ఇదే సమయంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే వసంత్ కృష్ణ ప్రసాద్ పై సీరియస్ అయ్యారు.
పార్టీనీ నమ్ముకునీ…ఓట్లు ఏపిస్తే చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలు వల్ల మంచి చేశామని.. పైన వ్యక్తులు చెప్పుకుంటున్నారు. అసలు మా దగ్గర దానికి రెండింతలు దోచుకుంటున్నారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై ఓ వృద్ధురాలు మండిపడిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు వైసిపి ప్రభుత్వం వచ్చాక ఉన్న రేట్లు అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఉన్న సమయంలో ఉన్న రేట్లు పొంతనలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా పరిపాలిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పేదవాళ్లు బిచ్చగాళ్ళుగా మారుతారని కొంతమంది ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.