Vidudala Rajani మహిళలకు ముఖ్యమంత్రి ఎప్పుడూ అండగా ఉంటారని జగన్ పాలనలో మహిళలందరూ ఎంతో ఆనందంగా ఉంటారంటూ..చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే మహిళల అదృష్టమంటూ కొనియాడారు. ఆరోజు అసెంబ్లీ సమావేశాల్లో మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉండడం ఈ రాష్ట్రంలోని మహిళలందరూ చేసుకున్న అదృష్టం అంటూ.. పొగడ్తలతో ముంచేస్తారు.కార్పొరేషన్లలో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎక్కడైనా 50% రిజర్వేషన్ కల్పించి మహిళలపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారంటూ.. అసెంబ్లీలో కొనియాడారు.
మహిళలకు ముఖ్యమంత్రి ఎప్పుడూ అండగా ఉంటారని జగన్ పాలనలో మహిళలందరూ ఎంతో ఆనందం గా ఉన్నారంటూ చిలకలూరిపేట ఎమ్మెల్యే రజిని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే మహిళల అదృష్టమంటూ కొనియాడారు ముఖ్యంగా డ్వాక్రా రుణాల విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతిఏటా రుణమాఫీ చేస్తున్నారని ప్రస్తుత బడ్జెట్లో కూడా డ్వాక్రా రుణమాఫీల కోసం 6400 కోట్లు కేటాయించారని ఆమె గుర్తు చేశారు. నాలుగు విడుదలుగా 25,516 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఇది చరిత్ర అంటూ సభ్యుల హర్షద్వానాల మధ్య విడదల రజని అన్నారు. వైయస్సార్ సున్నా వడ్డీ రుణాలు అందిస్తూ మహిళలపై పడే వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో కాంట్రాక్టు పనిలో 50% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత జగన్ దే నని అంటూ ఎమ్మెల్యే రజిని మరోసారి గుర్తు చేశారు.
పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, పాలకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర కళావతి,మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రభుత్వ బడులను కార్పోరేషన్ స్కూళ్లకు తగ్గట్లు తీర్చిదిద్దున జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన గిరిజన గూడెల్లోకి పాఠశాలల్లో కూడా మెరుగైన వసతులు కల్పించినట్లు గుర్తు చేశారు. ఆశ్రమ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందని కొనియాడారు..