Mahasena Rajesh : సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారానికి వెళ్లక ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్ జగన్ పై కోడి కత్తితో దాడి జరగడం తెలిసిందే. ఈ ఘటనలో వైయస్ జగన్ తృటిలో తప్పించుకోవడం జరిగింది. ఈ ఘటనకి పాల్పడిన శీను అనే వ్యక్తి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఇటీవల వైయస్ జగన్ కి సానుభూతి మీద ఓట్లు రావడానికి ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు ఎన్ఐఏ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా కోడి కత్తి ఘటనకు పాల్పడిన శీను ఇంటికి మహాసేన రాజేష్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అక్కడే అంబేద్కర్ జయంతికి సంబంధించి కేక్ కట్ చేయడం జరిగింది. కోర్టు తీర్పు ఇవ్వటంతో ఇంకా ఖర్చులకు సంబంధించి అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండగా ఉంటామని.. శీను కుటుంబ సభ్యులకు మహాసేన రాజేష్ భరోసా ఇచ్చారు.
భయపడాల్సిన అవసరం ఏమీ లేదని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రాజేష్ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా రాణిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కి సంబంధించి ట్రైనింగ్ క్యాంపులో కూడా బలంగా రాణిస్తున్నారు. అయితే అంబేద్కర్ జయంతి నాడు కోడి కత్తి ఘటనలో జైలు పాలైన శీను కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి వారిని ఓదార్చి.. ఆర్థికంగా అండగా ఉంటామని రాబోయే రోజుల్లో కూడా సహాయం చేస్తానని ఫోన్ నెంబర్ ఇచ్చి రాజేష్ మరోసారి ఇవ్వటంపై చంద్రబాబు అభినందించడం జరిగిందట. సరైన సందర్భంలో మంచి వీడియో చేశావని ప్రశంసించినట్లు టిడిపిలో టాక్.