TDP : నిన్న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 41వ టీడీపీ ఆవిర్భావ సభ విజయవంతంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. సభకు నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కూడా రావడం జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు ఆమె వచ్చిన వెంటనే లేచి నిలబడి… ఆమె చెప్పింది చాలా శాంతంగా తిని ప్రత్యేకంగా ఆమెకు వేదిక పై కీలక నాయకులతోపాటు సీటులో కూర్చోబెట్టడం జరిగింది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలలో కుకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన నందమూరి సుహాసిని ఓడిపోయారు. అయినా గాని ఆమెకు ఆవిర్భావ సభలో చంద్రబాబు ప్రత్యేకమైన గౌరవం ఇవ్వటం వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని ఈ సభలో టిడిపి కీలక నేతలు పేర్కొన్నారు.
నటుడిగా తనని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రజల కోసం ఏదైనా మంచి చేయాలి అనే మనసుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ పార్టీని స్థాపించారని చంద్రబాబు తెలియజేశారు. ప్రపంచంలో తెలుగు జాతికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించారు. దేశ విదేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేయాలని నిర్ణయించుకున్నాం. దీనిలో భాగంగా నేడు హైదరాబాదులో మొదటి మీటింగ్ పెట్టడం జరిగింది. రాజమండ్రిలో 100వ మీటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ వంటి మహానీయుడిని అందరూ గౌరవించుకోవాలి అన్న ఉద్దేశంతో తెలంగాణలో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో…. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం.
ఇక ఇదే సమయంలో వైఎస్ జగన్ పరిపాలనపై చంద్రబాబు సీరియస్ కామెంట్లు చేశారు. ఆనాడు ఓ విజన్ తో హైదరాబాద్ అభివృద్ధి చేయడం జరిగింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి తీర్చిదిద్దాలని నడుం బిగించాం. కానీ అక్కడ ముఖ్యమంత్రి జగన్ రాజధానిని సర్వనాశనం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కంటే సీఎం జగన్ నిర్ణయాల వల్లే ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నష్టం జరుగుతుందని విచారణ వ్యక్తం చేశారు. ఈ రీతిగా 41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
https://www.youtube.com/watch?v=5Q8_3wGwdCE