Yuvagalam : చంద్రబాబు నాయుడు బిక్షపెడితే.. మా దగ్గర పరిటాల రవి దగ్గర.. నిలబడి మాట్లాడే వ్యక్తి ఈరోజు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గా తయారయ్యాడు గన్నవరంలో ఇది ఎవరు పెట్టిన బిక్ష అంటే.. ముందుగా పరిటాల రవి బిక్ష పడితే ఆ తరువాత తెలుగుదేశం పార్టీ బిక్ష పెట్టింది.. ఈ భిక్ష తో మనిషిగా ఉండాలని హెచ్చరిస్తున్నాం.. అదే విధంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కూడా హెచ్చరిస్తున్నాం.. ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడితే కుదరదు. నీ చెత్త మాటలకు బుద్ధి చెప్పే విధంగా 10 నెలల్లో సరైన గుణపాఠం చెప్పబోతున్నం.. ఈ రాష్ట్రంలో కారణజన్మాలు ఎవరైనా ఉన్నారంటే.. అది నందమూరి తారకరామారావు మాత్రమే అలాగే ఈ నియోజకవర్గంలో అలాంటి కారణజన్ములు ఎవరైనా ఉన్నారంటే అది పరిటాల రవి మాత్రమే అని గుర్తు చేసుకున్నారు.అదేవిధంగా నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి కాదు.. ఈ దేశానికి కచ్చితంగా అవసరమైన నాయకుడు మనకి ఉండటం గర్వకారణం అని సభాముఖంగా తెలియజేస్తున్నాను అని టిడిపి నేత అన్నారు.

టిడిపి మీద లేని పోనీ మాటలు మాట్లాడినా మిగతా నాయకులను ఈ వేదికగా హెచ్చరిస్తున్నాను. ఒక తాత ముఖ్యమంత్రిగా.. ఒక తండ్రి ముఖ్యమంత్రిగా.. ఒక భర్త ముఖ్యమంత్రిగా ఒక తండ్రి ముఖ్యమంత్రిగా అలాగే ఒక కొడుకు ముఖ్యమంత్రిగా.. అయ్యే ఒకే ఒక వ్యక్తి నారా లోకేష్ మాత్రమే అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు.. ఈ అవకాశం ఈ రికార్డ్ వైసిపి నేతలకు సాధ్యమవుతుందా? టిడిపి నేతల మీద నోరు పారేసుకుంటున్నా ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా సాధ్యమవుతుందా అంటూ సభాముఖంగా ప్రశ్నించారు.
నేను ప్రశ్నించడమే కాదు నీకు సరైన సమాధానం మరికొన్ని రోజుల్లో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అంటూ హెచ్చరించారు అదేవిధంగా ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు మరికొద్ది రోజుల్లోనే వస్తుందని ఆ ఎలక్షన్లలో ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుందని పట్టభద్ర నియోజకవర్గ ఎలక్షన్లలో మీ పరాజయం కొట్టొచ్చినట్లు కనిపించిందని ఇక ఎలక్షన్లలో అది మరింతగా స్పష్టమవుతుందని గుర్తు చేశారు.