Undavalli Sridevi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో… క్రాస్ ఓటింగ్ కీ పాల్పడిన నలుగురిలో ఈమె కూడా ఉన్నట్లు వైసీపీ భావించి సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ హైకామాండ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా నాలుగు సంవత్సరాలు వాడుకొని వదిలేసి నిందలు వేశారని విమర్శించారు.

ఒక కాల్ గర్ల్ మాదిరిగా… డబ్బులకి అమ్ముడు పోయాను అని నిందలు వేస్తున్నారు. నా పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు. వాస్తవానికి నేను యూరప్ లో మంచి జీవితాన్ని గడుపుతూ వైద్యురాలిగా రాణిస్తున్నాను. అలాంటిదే అన్నీ సుఖాలు వదులుకొని రాజకీయాల్లో తాడికొండ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. రాజధాని ప్రాంతంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతున్న గాని పార్టీ కోసం నిలబడ్డాను. ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి సంతోషం కూడా ఎక్కడ లేదు. దళిత ఎమ్మెల్యేగా అనేక అవమానాలు తట్టుకుంటూ నిలబడ్డాను. నేను దళిత ఎమ్మెల్యే కాబట్టి నా పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు.
అదే రీతిలో కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయాలపై దాడి చేయగలరా..? అంటూ.. ఉండవల్లి శ్రీదేవి నిలదీశారు. అమ్ముడుపోయానని అంటున్నారు నేనేమైనా కాల్ గర్ల్ నా అని విమర్శల వర్షం కురిపించారు. ఇదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై మీడియా ముందు కంటనీరు పెట్టుకున్నారు. హైదరాబాదులో ఉండవల్లి శ్రీదేవి పెట్టిన మీడియా సమావేశం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.