Undavalli Sridevi : ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ కీ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నలుగురి ఎమ్మెల్యేలపై ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయడం తెలిసిందే. అయితే సస్పెండ్ అయిన వారిలో ఉండవల్లి శ్రీదేవి కూడా ఒకరు. పరిస్థితి ఇలా ఉంటే ఉండవల్లి శ్రీదేవి ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తనపై క్రాస్ ఓటింగ్ ఆరోపణల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయంగా నాలుగు సంవత్సరాలు పాటు తనని వాడుకొని పిచ్చి కుక్క మాదిరి ముద్ర వేసి బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి తో తనకు ప్రాణహాని ఉందని వాపోయారు. సజ్జలపై నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో వైసీపీ రౌడీలు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. బ్రదర్ గా అన్ని చూసుకుంటానన్న జగన్.. రాజధాని ప్రాంతంలో తనని లేకుండా చేయాలని వైసీపీ బిగ్ ప్లాన్ వేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీక్రెట్ ఓటింగ్ లో వాస్తవాలు తెలుసుకోకుండా నన్ను బలి చేశారు. ఏది ఏమైనా ప్రాణాలు పోయినా సరే రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తాను. అమరావతి రైతుల పక్షాన స్వతంత్ర ఎమ్మెల్యేగా పోరాడతాను.
జగనన్న ఇళ్ళ పథకం అనేది అతి పెద్ద స్కాం. అమరావతి మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నా.. ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. దోచుకో.. పంచుకో అనేదే వైసీపీ ప్రభుత్వం సిద్ధాంతం. నా ఇంట్లో గంజాయి పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఏపీలో మహిళా ఎమ్మెల్యేకు రక్షణలేని పరిస్థితులు ఉన్నాయి. జాతీయ మానవ హక్కుల సంఘం ఆశ్రయించి నాపై ఆరోపణలు చేసిన వారికి రిటన్ ఇస్తానని ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
https://www.youtube.com/watch?v=gAjjdlJe1nQ