ysjagan colony : బిగ్ దెబ్బ వాళ్ళందరికీ జగనన్న ఇళ్ళు రద్దు ?

ysjagan colony : జగనన్న కాలనీల్లో ఇళ్ళ పట్టాలు రద్దు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. పట్టాలుపొందిన లబ్దిదారుల్లో కొందరికి షాకులు తప్పవా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇళ్ళపట్టాల రద్దుకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీ చెప్పినదానికి వాస్తవంగా జరుగుతున్నదానికి చాలా వ్యత్యాసముందనే అనిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే జగనన్న కాలనీల్లో ప్లాట్లు తీసుకుని ఇళ్ళు నిర్మించుకోని వాళ్ళకి ప్లాట్లను రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుంది. ఈ విషయం గుంటూరు జిల్లా వేణుగోపాలరెడ్డి ఆదేశాల ద్వారానే బయటపడింది. ఎలాగంటే జిల్లాలోని తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామముంది. ఈ గ్రామంలో పర్యటించి ఇళ్ళ నిర్మాణాల తీరును స్వయంగా పరిశీలించారు. కొందరు ఇళ్ళు కట్టుకుంటుందే మరికొందరు మాత్రం ఇంకా మొదలుపెట్టలేదన్న విషయాన్ని గమనించారు.

The big blow is the cancellation of Jagananna houses for all of them
The big blow is the cancellation of Jagananna houses for all of them

ysjagan colony : సాకులుచెబుతు కొందరు ఇళ్ళ నిర్మాణాలను వాయిదా

ఇంటి నిర్మానం మొదలుపెట్టని లబ్దిదారులతో మాట్లాడారు. ఇళ్ళు లేనివారికోసం ప్రభుత్వం స్ధలాలు కేటాయించి, నిర్మాణ సామగ్రిని రాయితీలపై ఇస్తున్నట్లు చెప్పారు. పేదల ఇళ్ళ నిర్మాణాల కోసం ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తుచేశారు. పేదలకోసం జగన్ ప్రభుత్వం ఇంతచేస్తుంటే ఇళ్ళు కట్టుకోవటానికి లబ్దిదారులకు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. లబ్దిదారుల్లో ఎవరి సమస్యలను వాళ్ళు చెప్పుకున్నారు. దాంతో సాకులుచెబుతు కొందరు ఇళ్ళ నిర్మాణాలను వాయిదా వేసుకుంటున్నట్లు గ్రహించారు.

ఇళ్ళ నిర్మాణాలను మొదలుపెట్టనివారికి కలెక్టర్ అక్టోబర్ నెలాఖరువరకు గడువిచ్చారు. అప్పటికీ నిర్మాణాలు మొదలుపెట్టని లబ్దిదారులకు ఇంటి పట్టాలను రద్దు చేయటం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. మరి కలెక్టర్ ఆదేశాల తర్వాతైనా లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణాలు మొదలుపెడతారా ? ఇక్కడ గమనించాల్సిందేమంటే రాష్ట్రం మొత్తంమీద 38 లక్షల మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇళ్ళపట్టాలు మంజూరుచేసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతపెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్ని లక్షల పట్టాలను ఇవ్వలేదు. అందుకనే ఇచ్చిన పట్టాలు పక్కదారి పట్టకుండా లబ్దిదారులే ఉపయోగించుకోవాలని గట్టిగా కోరుకుంటున్నది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.