YCP-TDP : రెడ్డి సామాజిక వర్గం అనగానే వైసిపి అనే పరిస్థితి ఏపీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ రెడ్డి వర్గం హవానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వైసిపి వచ్చాక అనేకమంది రెడ్డి నేతలకు పదవులు కూడా వచ్చాయి. ఇక వైసిపి నుంచి దాదాపు 50 మంది వరకు రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచారు.అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో రెడ్డి వర్గం పూర్తి మద్దతు వైసిపికి దక్కింది. వైసిపి వచ్చాక రెడ్డి నేతల పెరిగిన విషయం వాస్తవమే.. కానీ నాయకులకు మాత్రం కావలసిన పనులు మాత్రమే జరిగాయి. రెడ్డి సామాజిక వర్గం ప్రజలకు సరైన న్యాయం జరగలేదు. దీంతో రెడ్డి వర్గం ప్రజలు వైసీపీ పై అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పూర్తిస్థాయి వైసిపికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు.
కొందరు టిడిపి వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది. దీంతో ఈసారి టిడిపి నుంచి కొందరు రెడ్డి గెలుపు దిశగా వెళుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే టిడిపిలోని రెడ్డి నేతలు దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని కసితో ఉన్నారు. దీంతో ఈసారి కొందరు రెడ్డి తమ్ముళ్లు గెలిచి గట్టెక్కడం కాయంగా కనిపిస్తుంది. ఇటీవల సర్వేలో పలువురు రెడ్లు తమ్ముళ్లు కూడా గెలుపు దిశగా వెళుతున్నారని తెలుస్తోంది.అలాగే గెలుపు దిశగా వెళుతున్న వారిలో పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పొలములేరు అమర్నాథ్ రెడ్డి, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి,బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రాలయంలో తిక్కారెడ్డి, ఆలూరు లో కోట్ల సుజాతమ్మ, శ్రీశైలంలో బుద్ధా రాజశేఖర్ రెడ్డి, ఈ విధంగా కొంతమంది రెడ్డి నేతలు విజయదశగా వెళుతున్నారు.
ఎన్నికల నాటికి టీడీపీ రెడ్డి నేతలు ఎంతమంది లిస్టులో ఉంటారో చూడాలి, అంతేకాదు నెల్లూరులో అయితే పెద్ద మొత్తంలో రెడ్ల చేరికే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వారంతా సరైనా సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇంతమంది రెడ్లు టిడిపిలో చేరుతారని ఎవరు ఊహించలేదు.