TDP – YCP : పెద్దల పోరులోనూ దొంగ ఓటర్ల కలకలం నెలకొంది. వైసీపీ అధికార దాహంతో అడ్డదారులు తొక్కుతూ.. అనర్హులకు ఓటు కల్పించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. పదో తరగతి లోపు చదివిన వారికి ఓటు హక్కు కల్పించి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించింది. తిరుపతి కేంద్రంగా ఈ దొంగ ఓటర్ల భాగోతం వెలుగు చూసింది.ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఖాళీగా ఉన్న మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ ఎన్నికల్లో దొంగ ఓటర్ల ప్రభావం భారీగా వెలుగులోకి వచ్చాయి.ఆ ఓటర్లను అడ్డుకున్న టీడీపీ, వామపక్ష నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ముందు నుంచి దొంగ ఓటర్ల జాబితాపై ఎన్నికల అధికారికి ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమీ ఉపయోగం లేదు .
వారిని నిలువరించలేక పోయారు. దాంతో భారీగా ఎన్నికల్లో దొంగ ఓటర్లు, నగదు పంపిణీ జోరుగా సాగాయి.. రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, నాలుగు స్థానిక సంస్థల నియోజక వర్గాలు కలుపుకుని మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగింది.ఒంగోలు సెయింట్ థెరిస్సా పోలింగ్ కేంద్రం వద్ద రెండు పార్టీల శ్రేణులు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఓటర్లకు సాయం చేసే క్రమంలో టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టడంతో ఈ ఘటనకు దారి తీసింది. దాంతో ఇరు వర్గాలను పోలీసులు చెల్లాచెదురు చేసి అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇక ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేరుకున్నారు. వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేయడానికి తనతో పాటు 50 మంది కార్యకర్తలను తీసుకొని పోలింగ్ బూత్ కి రాగా టిడిపి వాళ్లు ఆయనను నిలువరించి రాకుండా అడ్డుకున్నారు. దాంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి
https://www.youtube.com/watch?v=zYrrThMqS3E