TDP-YCP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక్కసారిగా ఫలితాలు పాజిటివ్ గా రావడంతో.. క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది. మరోపక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమితో పాటు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వైయస్ అవినాష్ రెడ్డి పేరు తెరపైకి రావటంతో.. పాటు ఆయన తండ్రి అరెస్టు కావటంతో వైసీపీ గ్రాఫ్ పడిపోతూ ఉంది. సొంత పార్టీ నేతలు.. ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు నుండి సరైన గౌరవం దక్కటం లేదని.. బయటికి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటూ ఉంటున్న తరుణంలో.. లోకేష్ పాదయాత్రకి…చంద్రబాబు చేపడుతున్న “ఇదేం కర్మ” కార్యక్రమాలకు జనాలు పోటెత్తుతున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే బుధవారం చంద్రబాబు కడపలో పర్యటించడానికి జిల్లాలో అడుగు పెట్టడం జరిగింది. కడపలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభలో మాట్లాడేటానికి… భారీ కాన్వాయ్ తో ఎంట్రీ ఇవ్వగా కొంతమంది వైసీపీ నాయకులు.. అడ్డుపడే ప్రయత్నం చేయగా వెంటనే స్థానిక తెలుగుదేశం పార్టీ క్యాడర్.. అడ్డుపడుతున్న వైసిపి కార్యకర్తలను తరిమికొట్టడం జరిగింది. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉండటంతో చంద్రబాబు నాయుడు ఫుల్ సంతోషంగా ఉన్నారు. మరోపక్క నారా లోకేష్ పాదయాత్రకి కూడా జనాలు రావడంతో పాటు తమ సమస్యలు చెబుతూ ఉండటంతో… వారికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి న్యాయం జరుగుతుందో అన్ని వివరిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఒకపక్క నాయకులు మరోపక్క కార్యకర్తలు టీడీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావటానికి తమ వంతుగా కృషి చేస్తున్నారు.