YS Aivinash Reddy : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చివరి దశకు చేరుకుంది. ఈనెల 30వ తారీకు లోపు విచారణ మొత్తం కంప్లీట్ చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో… విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. దీనిలో భాగంగా గత ఆదివారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని.. అరెస్టు చేయడం తెలిసిందే. ఇదే సమయంలో ప్రస్తుతం వైయస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఐదోసారి విచారిస్తూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో వైయస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం… దానికి కోర్టు ఈనెల 25వ తారీకు వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకూడదని.. విచారణ.. ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని సీబీఐనీ ఆదేశించింది.
పరిస్థితి ఇలా ఉంటే వైయస్ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వైఎస్ సునీత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీజేఐ రేపు విచారించనున్నట్లు సమాచారం. ఈనెల 25 వరకు అవినాష్ ను అరెస్టు చేయొద్దని.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా.. సుప్రీంలో సునీత వేసిన పిటిషన్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏది ఏమైనా మొదటి నుండి ఈ కేసులో వైయస్ అవినాష్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తూ ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ వివేక కేసు వైసీపీ పార్టీకి మచ్చ తెచ్చే రీతిలో కనిపిస్తుంది.
మరి రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎవరు అరెస్ట్ అవుతారు..? ఏం జరుగుతుందన్నది..? చాలా ఉత్కంఠ భరితంగా మారింది. ఇక ఈ కేసులో అప్రూవర్ దస్తగిరికి 24 గంటలు పోలీస్ భద్రత కడప జిల్లా ఎస్పీ కల్పించడం జరిగింది. తనకు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల నుండి ప్రాణహాని ఉన్నట్లు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో… పోలీస్ భద్రత కల్పించారు.