YS Viveka Case : సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటంతో… వాళ్లే చేపించినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే బాబాయ్ ని చంపి ఎన్నికలలో సానుభూతి కోసం జగన్ కుట్రకు తేరలేపరని టిడిపి నేతలు వ్యాఖ్యలు చేశారు. ఈ రీతిగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావటంతో వైఎస్ వివేక హత్య కేసులో న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కానీ తీరా చూస్తే కేసు ముందుకు వెళ్ళని పరిస్థితి.

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కూతురు వైయస్ సునీత రంగంలోకి దిగి న్యాయస్థానాలలో పోరాడి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత విచారణ జరిగేలా చేశారు. అయితే ఈ కేసులో మొదటి నుండి కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మూడుసార్లు సీబీఐ విచారణకి కూడాహాజరయ్యారు. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు..వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే సుప్రీంకోర్టు ఇటీవల నెల రోజుల్లో వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఇటువంటి క్రమంలో వైయస్ వివేకానంద హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దీంతో వైసిపి ప్రభుత్వం పై మరింత విమర్శలు ప్రతిపక్షాల నుండి మొదలయ్యాయి. అయితే కొద్ది రోజుల క్రీతం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టడం జరిగింది. ఆ తర్వాత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడం జరిగింది. దీంతో ఢిల్లీలో వైయస్ జగన్ మేనేజ్ చేయటంతోనే అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేసుకున్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
https://www.youtube.com/watch?v=4JiSyt4zH2w