AP New CM : ఏపీకి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అంటూ..టీడీపీ మాజీమంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే ప్రస్తుతం వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వరుస పెట్టి అరెస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆదివారం ఉదయం పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డినీ CBI అధికారులు అరెస్టు చేసి చంచలగూడ జైలుకి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి.. విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలో అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ముందు జాగ్రత్తగా విచారణకు వెళ్లకు ముందే.. తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ కేసు గురించి సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ సొంత చిన్నానను… ఎందుకు చంపుతారు అని.. అవినాష్ పై వచ్చిన వార్తలకు మండి పడటం జరిగింది. ఇదే సమయంలో ఒక కన్ను మరోక కన్నును ఎందుకు పొడుస్తుందని.. వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారడంతో పాటు అవినాష్ రెడ్డి తండ్రి అరెస్టు కావడంతో.. దీనికి బాధ్యతగా సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించాలని… దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రజలంతా ఈ కేసు విషయంలో గమనిస్తున్నారని నిజాలు బయటపడుతున్నాయని తప్పించుకునే అవకాశాలు.. చెప్పు కోస్తున్నారు. అసెంబ్లీలో సీఎం జగన్.. ఈ కేసు గురించి చేసిన కామెంట్లు ఆస్కార్ అవార్డులు గెలుచుకునేటట్లు ఉన్నాయని.. వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో తాజా పరిణామాలపై.. సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.
https://www.youtube.com/watch?v=YPsBORgXK8o