Aadinarayana Reddy : బీజేపీ నేత సత్య కుమార్ వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 1200వ రోజు అమరావతి ఉద్యమానికి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులతో పాటు బీజేపీ తరపున జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమం ముగించుకుని అనంతరం సత్య కుమార్ వాహనంపై రాళ్ల దాడి జరిగిందంట. ఈ విషయాన్ని ఆయనే మీడియా సమావేశం నిర్వహించి తెలియజేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ గుండాలు తమపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. కారు పై రాళ్లు దాడులు జరుగుతున్నా గాని… పోలీసులు అడ్డుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి అడ్డుకట్ట వేస్తాం. ఈ ఘటనకు సంబంధించి జగన్ కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటాడు..అని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలు దృష్టికి తీసుకెళ్తామని అదేవిధంగా రెండు మూడు రోజుల్లో రాష్ట్ర బిజెపి కార్యవర్గం కూడా కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించినట్లు సత్య కుమార్ పేర్కొన్నారు. తాడేపల్లిలో సీఎం జగన్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగినట్లు తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారని ఎంపీ సురేష్ అన్నారంటే అర్థం ఏంటీ?, ఆదినారాయణ రెడ్డి మీద బాబాయ్ గొడ్డలి పోటు పడేదా?’ అని సత్యకుమార్ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆదినారాయణ రెడ్డి సైతం జగన్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతిని సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో తనపై దాడికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆనాడు వైఎస్ వివేక హత్య కేసులో కూడా తనపై అనేక ఆరోపణలు చేసినట్లు గుర్తు చేశారు. అప్పుడు చెబుతున్న మళ్లీ ఇప్పుడు చెబుతున్న నేను తప్పు చేస్తే ఉరిశిక్ష వెయ్యండి అంటూ ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.