Mahasena Rajesh : మహాసేన మీడియా ఆపేస్తున్నట్లు ప్రకటించిన రాజేష్..!!

Mahasena Rajesh సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వారిలో మహాసేన రాజేష్ ఒకరు. దళిత వర్గాలకు చెందిన ఈయన 2019 ఎన్నికల టైములో వైఎస్ జగన్ గెలవాలని…వైసీపీకి మద్దతు ఇవ్వటం జరిగింది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొన్ని తప్పుడు కేసులు మహాసేన రాజేష్ పై నమోదు కావటంతో వైసీపీకి వ్యతిరేకంగా గత రెండు సంవత్సరాలకు పైగా పోరాడుతున్నారు. కొద్ది నెలల క్రితం చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం కూడా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో దళిత సమస్యలపై నిత్యం పోరాడుతూ గుర్తింపు పొందిన రాజేష్ “మహాసేన” అనే మీడియా వేదికగా అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ మహాసేన మీడియా వేదికగా పలు కీలకమైన విషయాలలో రాజేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనాలు సృస్టించయి. ఈ క్రమంలో కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ దాక కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

“మహాసేన మీడియా” ద్వారా సోషల్ మీడియాలో తిరుగులేని ఇమేజ్ రాజేష్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మహాసేన మీడియా ఆపేస్తున్నట్లు రాజేష్ సంచలన వీడియో పోస్ట్ చేశారు. పూర్తి విషయంలోకి వెళ్తే ఇంటర్నెట్ విషయంలో ఇంకా కరెంట్ విషయంలో ప్రభుత్వం నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అందువల్లే ముందుకి కొనసాగించలేని పరిస్థితి నెలకొందని వివరించారు. ఈ క్రమంలో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి జనరేటర్ తోపాటు సెల్ఫ్ ఇంటర్నెట్ పెట్టుకోవడానికి అయిదు లక్షలు చెల్లిస్తే చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు.

ఇవి అందుబాటులో ఉంటే ఎవరితో పని అవసరం ఉండదని.. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఏదైనా సోషల్ మీడియా ద్వారా పంచుకోవచ్చనీ స్పష్టం చేశారు. అంతేకాదు తనతో పాటు ఈ మహాసేన మీడియాలో దాదాపు 15 మంది పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మహాసేన మీడియాకీ వచ్చే డబ్బులను 15 మంది సమానంగా పంచుకుంటామని రాజేష్ వివరించారు. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ మరియు కరెంటు వంటి సదుపాయాలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో… జనరేటర్ కి… సెల్ఫ్ ఇంటర్నెట్ వైఫైకీ దాతలు ముందుకొస్తే… సంతోషిస్తామని మహాసేన రాజేష్ సంచలన వీడియో పోస్ట్ చేశారు.

https://www.youtube.com/watch?v=tSFWJk45OGM