Ys Jagan : బిగ్ న్యూస్ వైసిపి లోకి ప్రభాస్ సోదరుడు.!? జగన్ పెద్ద స్కెచ్ వేసాడుగా.!

Ys Jagan : రాష్ట్ర రాజకీయాలకు సినీ యాక్టర్స్ కు మధ్య పెద్ద లింకే ఉంది.. ఇప్పటికే చాలా మంది సినీ తారలు ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఇటీవల కృష్ణంరాజు చనిపోయారు.. వివిధ రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా బీజేపీ జాతీయ నేతలు కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు.. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యామిలీకి సంబంధించి కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.. కృష్ణంరాజు కుటుంబం నుంచి ఒకరు రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.. ప్రభాస్ సొంత సోదరుడు ప్రబోధ్ ను రంగంలోకి దింపాలని బిజెపి ప్లాన్ వేసిందని.. ఆ ప్లాను వైసిపి తిప్పి కొట్టాలని మాస్టర్ స్కెచ్ వేసిందని సమాచారం..!

Prabhas brother to Big News YCP.!? Ys Jagan  made a big sketch
Prabhas brother to Big News YCP.!? Ys Jagan made a big sketch

గోదావరి జిల్లాలో ప్రభాస్ ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో గా ప్రభాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.. ప్రభాస్ క్రేజ్ ను రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను పార్లమెంటు ఎన్నికలలో వినియోగించుకోవాలని బిజెపి కసరత్తులు చేస్తుందని చెబుతున్నారు.. ఇందులో భాగంగానే కృష్ణంరాజు కుటుంబాన్ని బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.. ప్రభాస్ కుటుంబం లో ఒకరిని బిజెపిలోకి ఎంట్రీ ఇస్తే గోదావరి జిల్లాలో తమకు ప్లస్ అవుతుందని.. బిజెపి పక్క వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది.. గతంలో కృష్ణంరాజు బిజెపి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి ప్రభాస సోదరుడు ప్రబోధ్ ను బిజెపి అభ్యర్థిగా పోటీ చేయిస్తారని సమాచారం.. నర్సాపురం లోక్సభ పరిధిలో ప్రభాస్ సొంత సామాజిక వర్గమైన క్షత్రియులు బలంగా ఉన్నారు. ప్రభోథ్ ను బరిలో దింపితే నరసారావు నరసాపురంలో గెలవడం ఖాయమని కమలనాధులు లెక్కేస్తున్నారని తెలుస్తోంది.. అంతేకాదు క్షత్రియలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో బలంగా ఉన్నారు.. ప్రభాస్ స్టార్ ఇమేజ్ ను బిజెపి వినియోగించుకోవాలని ఆలోచన ఉందని బిజెపి వర్గాల అంచనా..

Ys Jagan : వైసిపి మరో భారీ స్కెచ్

ఇది ఎలా ఉంటే వైసిపి మరో భారీ స్కెచ్ వేసింది.. జగన్ బిజెపి అంచనాకు అందని విధంగా మాస్టర్ ప్లాన్ వేశారు.. ఇప్పటికే విజయ్ సాయి రెడ్డిని ప్రభాస్ తో పాటు తన సోదరుడు ప్రబోధ్ ను కూడా కలిసి తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది.. ప్రభాస్ తో పాటు తన సోదరుడు ప్రబోధ్ కూడా వైసిపి లోకి రావడానికి సుముఖత చూపినట్టు వైసిపి నేతలు అనుకుంటున్నారు.. మరి ఇందులో నిజం ఎంత అనేది చూడాలి..

Advertisement