TDP : అమరావతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శోభాకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో చంద్రబాబు మరియు పార్టీ సీనియర్ నేతలు పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్బంగా పులుపుల వెంకట ఫణి కుమార్ శర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయమనీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మరింతగా బలపడనుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలోకి భారీ ఎత్తున… జాయినింగ్ లు ఉంటాయని స్పష్టం చేశారు. ఊహించని విధంగా జరిగే పార్టీ ఫిరాయింపులు అందరికి షాక్ కీ గురిచేస్తాయని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో… ఆర్థిక సంక్షోభం తాండవం చేస్తది. కానీ భారత రూపాయికి పెద్దగా కష్టాలేమి ఉండవు. ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక జాతీయ రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారు మరింత బలపడనున్నారు. అన్ని పార్టీలు తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాయని పంచాంగ కర్త కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇంకా న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయి. ధరలు పెరుగుదల కారణంగా ప్రధాన ప్రతిపక్షలు పోరాటాలు చేస్తాయి.
ఈ క్రమంలో ఆర్థిక సమస్యల కారణంగా సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గించే రీతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి. ఆహార కొరతతో పాటు విద్యా మరియు వైద్య రంగాల్లో స్కాంలు కూడా బయటపడతాయి. అభివృద్ధి కంటే అనారోగ్యకరమైన పోటీకి పార్టీల వ్యవహార శైలి ఉంటాయి. అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ కూడా ఏర్పడుతుంది. అధిక తుఫాను ప్రభావంతో పాటు ఉత్తరాంధ్ర.. కోస్తా ఆంధ్రాలో కూడా భూకంపాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.. అని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంచాంగం వివరించడం జరిగింది.
https://youtu.be/cTsyi-U9JdIhttps://youtu.be/cTsyi-U9JdI