Sajjala Ramakrishna Reddy : పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఊహించని విధంగా టీడీపీ పుంజుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ క్యాడర్ లో జోష్ నెలకొంది. పరిస్థితి ఇలా ఉంటే నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కీ పాల్పడటం తెలిసిందే. దీంతో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా సభ్యుల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. ప్రలోభాలు.. డబ్బు కారణంగానే ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసి ఉంటారని చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికలకు ప్రజల ద్వారా జరిగే ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్పందించారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేది చంద్రబాబు నాయుడు తప్ప వేరొక నాయకుడు లేరని వైసీపీ ఎమ్మెల్యేలే ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు. ఇది నిజంగా అసాధారణమైన విజయమని పయ్యావుల కేశవ్ అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం ఉంది.
సంఖ్యాబలం ప్రకారం అసలు పోటీ పెట్టకూడదు. అయినా పోటీ పెట్టారు, ఫలితాలలో 23 నెంబర్ రావడం అనేది దేవుడు స్క్రిప్ట్ కనపడుతుంది అంటూ.. వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజలకి ప్రభుత్వంపై నమ్మకం లేదని రుజువు చేస్తే… నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో శాసనసభ్యులకు కూడా ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదని రుజువు చేశాయి అని తెలిపారు. ప్రతిపక్షాలను తొక్కి పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీ గెలిచింది అని పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.