Payyavula keshav : ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరిన పయ్యావుల కేశవ్..

Payyavula keshav : వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ నాయకులకు బినామీల పేరిట అమరావతిలో భూములు ఉన్నాయని చేస్తున్న ఆరోపణలు తగదని, ఇందుకు సంబంధించిన బినామీ భూముల జాబితాను కేంద్రానికి పంపాలని, బినామీ ఆస్తులను కేంద్రానికి అటాచ్ చేయాలని సవాల్ విసిరారు.

payyavula-keshav-paiyyavula-keshav-strong-counter-on-ycp-in-binami-act
payyavula-keshav-paiyyavula-keshav-strong-counter-on-ycp-in-binami-act

ఆ భూములు అమ్మి రాష్ట్ర ఖజనాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బినామీ ఆస్తులను జప్తు చేయాలని కోరితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. బినామీలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొచ్చిందని, ఆ భూములను వెంటనే సీజ్ చేసే అధికారం కేంద్రానికి ఉందని తెలిపారు.

ఆ చట్టానికి సంబంధించిన ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదేమో అన్న పయ్యావుల కేశవ్, బినామీ యాక్టుకు సంబంధించిన ప్రతిని స్పీకర్ తమ్మినేని ద్వారా ప్రభుత్వానికి అందజేశారు. అమరావతిలో గాని ఇంకా ఎక్కడైనా బినాముల పేరిట భూములు ఉన్నాయని మీకు అనిపిస్తే వాటిని వెంటనే సీజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించమని ప్రతిపక్ష పార్టీ నేతలకు సవాల్ విసిరారు వైసీపీ నేతలు ఎవ్వరు కూడా కిక్కురు మనలేదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బినామీ చట్టం గురించి టిడిపి నేత పయ్యావుల కేశవ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరింత సమాచారం కొరకు పై వీడియోని పూర్తిగా వినండి.