Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ రెండోసారి ఎలాగైనా గెలిచి ఇంకా తిరుగులేని భవిష్యత్తు సంపాదించుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో నేతలకు అధ్యక్షుడు జగన్ 175 కి 175 స్థానాలు టార్గెట్ గా పెట్టడం జరిగింది. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలని అందరూ కష్టపడాలని తర్వాత 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదని జగన్ చెప్పుకొస్తున్నారు. మరోపక్క ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఛీలకుండా ఏకం కావడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్నాయి.
ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు నుండి పగడ్బందీ ఆలోచనలతో ఉన్నారు. ఇదే సమయంలో వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ చేపట్టడం తెలిసిందే. ఆల్రెడీ బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో తన స్టాండ్ ఢిల్లీ బీజేపీ పెద్దల ముందు పవన్ పెట్టడం జరిగిందంట. మీ ధోరణి ఎలా ఉన్నా నేను మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఛీలకుండా వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు పవన్ కరాకండిగా చెప్పేయడం జరిగిందంట.
దీంతో తెలుగుదేశం పార్టీతో బిజెపి కలవకపోయినా తాను కలవటానికి రెడీ అయినట్లు ఇన్ డైరెక్టుగా ఢిల్లీ బీజేపీ పెద్దలకు పవన్ చెప్పకనే చెప్పేసారట. ఇదే విషయాన్ని తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలియజేశారు. నూటికి నూరుపాళ్లు తెలుగుదేశం పార్టీతో జనసేన కలవబోతుందని… పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఛీలకుండా జనసేన..టీడీపీ కలసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.