Pattabhi Ram : పట్టాభి పై ఎంత దారుణం జరిగిందో చూడండి.. ప్రతి 15నిమిషాలకు ఆయన ఫోన్..

 

 

Pattabhi Ram :  తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బీసీ నాయకుడిగా అండగా నిలబడడం కోసం మేము గన్నవరం వెళితే సీఎం జగన్ అప్పటినుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అధికరాతకంగా దాడి చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలపై దాడులు జరిగిన అన్యాయం జరిగిన మేము వెళ్తామని చెప్పారు. ఆ రోజు ఆయనని ఎందుకు అరెస్టు చేశారు.. అరెస్టు చేసిన తర్వాత ఎటువైపుకి ఆయన్ని తీసుకువెళ్లారు. ఆయనపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారు అనేది ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊహించని నిజాలు బయటపెట్టారు పట్టాభి..

పట్టాభిని పోలీసులు వారి వాహనంలోకి ఎక్కించుకొని ఏ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నారౌ చెప్పకుండా.. అర్థరాత్రి రెండు గంటల వరకు సుమారు 200 కిలోమీటర్లు తిప్పారని పట్టాభిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు ఇద్దరూ ఎస్ఐలకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి జిల్లా ఎస్పీ ఫోన్ చేస్తున్నారని.. ఆయన చెప్పిన డైరెక్షన్ ప్రకారమే నేను ఎక్కిన పోలీసు వాహనం తిరుగుతుందని అన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఆ వాహనం తిరుగుతూనే ఉందని… ఇక చివరిగా తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ కి నన్ను తీసుకెళ్లారని.. ఆ ఊరంతా కరెంటు ఉంటే విచిత్రంగా ఆ పోలీస్ స్టేషన్లో కరెంటు లేదని చెప్పారు.

నేను నాతో పాటు ఉన్న ఇద్దరు ఎస్ఐల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ లో కరెంట్ లేదనీ అడిగితే.. ఏదో చిన్న ప్రాబ్లం అని చెప్పి నన్ను ఆ స్టేషన్లోకి తీసుకువెళ్లారని.. పూర్తిగా చీకటిగా ఉన్నా నన్ను అక్కడ వదిలేసి ఆ ఇద్దరు ఎస్ఐలు కూడా బయటకు వెళ్లిపోయారని.. ఆ తరువాత ముగ్గురు దొంగలు వచ్చి నా తలకి కండువా చుట్టి అతికిరాతకంగా కొట్టారని తెలిపారు. నా కాళ్లు , చేతులపై బాగా కొట్టారని సుమారు 35 నిమిషాల తర్వాత పాటు నాపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేసి వెళ్లిపో యారని పట్టాభి అన్నారు. పట్టాభిరామ్ కి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు 25000 చొప్పున పూచికత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పట్టాభి బయటకు రాగానే టిడిపి నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.