Pattabhi Ram : టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బీసీ నాయకుడిగా మద్దత్తు ఇవ్వడం కోసం గన్నవరం వెళితే.. తనని అరెస్టు చేయడంతో పాటు ఆ రోజు రాత్రి తనను చంపడానికి కూడా పలు ఏర్పాట్లు చేశారని.. ఇదంతా ప్రతిపక్ష పార్టీ వాళ్ళే చేశారని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలను బయటపెట్టారు..
పట్టాభి ని పోలీసులు అరెస్టు చేయకముందే తన వాహనంపై దాడి చేశారని తన వెనకమాల వస్తున్న పోలీసులు కూడా పట్టించుకోకుండా ఇనప రాడ్డులతో తన వాహనాన్ని ధ్వంసం చేశారని ఇక పోలీసులు వాళ్ల వాహనంలోకి తనని ఎక్కించుకున్నన మొదలు నన్ను ఏ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నారౌ చెప్పలేదని.. సాయంత్రం నుంచి అర్థరాత్రి రెండు గంటల వరకు సుమారు 200 కిలోమీటర్లు తిప్పారని పట్టాభిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పోలీసులలో నాతోపాటు ఉన్న ఇద్దరూ ఎస్ఐలకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి జిల్లా ఎస్పీ ఫోన్ చేస్తున్నారని.. ఆయన చెప్పిన డైరెక్షన్ ప్రకారమే ఆ వాహనం తిరుగుతుందని అన్నారు.
తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ కి నన్ను తీసుకెళ్లారని.. ఆ ఊరంతా కరెంటు ఉంటే విచిత్రంగా ఆ పోలీస్ స్టేషన్లో కరెంటు లేదని చెప్పారు. నేను నాతో పాటు ఉన్న ఇద్దరు ఎస్ఐ లును ఎందుకు పోలీస్ స్టేషన్ లో కరెంట్ లేదనీ అడిగితే.. ఫ్యుజు పోయింది అని చెప్పి నన్ను ఆ స్టేషన్లోకి తీసుకువెళ్లి వాళ్ళు బయటకు వెళ్లిపోయారని.. ఆ తరువాత ముగ్గురు దొంగలు వచ్చి నా తలకి కండువా చుట్టి అతికిరాతకంగా కొట్టారని తెలిపారు. నా కాళ్లు , చేతులపై బాగా కొట్టారని సుమారు 35 నిమిషాల తర్వాత పాటు నాపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేసి వెళ్లిపో యారని పట్టాభి అన్నారు.
సగటు మనిషి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. కానీ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లిన నన్ను చిత్రహింసలకు గురిచేసి 14 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచి ఎవరు కక్ష సాధింపు సాధించారో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని పట్టాభిరామ్ తెలిపారు. నాలాంటి వాడికి ఇంత జరుగుతుంటే. సామాన్య మానవుడికి ఇంకా ఎంత అన్యాయం జరుగుతుందో ఈ ప్రభుత్వంలోని పట్టాభిరామ్ అన్నారు.