Paritala Sriram : నారా లోకేష్ పాదయాత్ర ధర్మవరంలో సంచలనం సృష్టించింది. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అవినీతి భాగోతాలు బయటపెడుతూ.. లోకేష్ సెల్ఫీ సవాల్ ఏపీ రాజకీయాల్లోనే కలకలం సృష్టించింది. ముఖ్యంగా చెరువు ఆక్రమించుకొని… అక్రమంగా విలాసవంతమైన భవనం ఎమ్మెల్యే కేతిరెడ్డి కట్టుకున్నారని… అక్రమంగా భవనం నిర్మించినట్లు డ్రోన్ ఎగరేసి ఆ మొత్తం షూట్ చేయటం జరిగింది. అయితే తనపై లోకేష్ చేసిన ఆరోపణలకు విజయవాడలో కరకట్ట దగ్గర చంద్రబాబు నివాసం ఉన్న ఇంటిని చూపిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి కౌంటర్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది.
ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్ విషయంలోకి ఎంటర్ అయ్యి… తనదైన శైలిలో మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కరకట్టలో నివాసం ఉంటున్న ఇంటికి గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోని పర్మిషన్లు వచ్చినట్లు స్పష్టం చేశారు. నువ్వు చేసిన అక్రమాలు అవినీతి మొత్తం అంతా ధర్మవరం ప్రజలందరికీ తెలుసు అని…అన్నారు. ముఖ్యంగా ఫామ్ హౌస్ దానికి బదులు గుర్రాల కోట అనే పేరుతో ప్రజలు రకరకాలుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి అవినీతి గురించి మాట్లాడుకుంటున్నట్లు పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు.
ఆరు ఎకరాలు కలిగిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈరోజు వందల ఎకరాలు ఎలా సంపాదించావో ప్రజలకు చెప్పాలని సంచలన ప్రశ్నలు వేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి కాంట్రాక్టర్ కాదు వ్యాపారాలు కూడా చేయరు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం మినహా… ఇటువంటి వ్యక్తికి ధర్మవరం చుట్టుపక్కల ఇన్ని వందల ఎకరాలు ఏ రకంగా వచ్చాయో చెప్పాలి..?. ఏమైనా ఎక్కువ మాట్లాడితే మీ కథలు మొత్తం బయట పడేస్తా .. అంటూ పరిటాల శ్రీరామ్ … మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు.