Paritala Sriram : ఎమ్మెల్యే కేతిరెడ్డి అవినీతి పై పరిటాల శ్రీరామ్ సీరియస్ ప్రెస్ మీట్..!!

Paritala Sriram : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటు రెడ్డి అంటేనే నువ్వు అలా వెలవెలలాడిపోయావు… మరి నీ గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో పిల్లలపై ఎటకారం చేస్తావు. ప్రభుత్వ అధికారులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటావు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏదో పెద్ద పాపులారిటీ సంపాదించుకున్న రీతిలో వ్యవహరిస్తావు. నీకేనా కోపం ఉండేది… వాళ్లకి ఉంటాయి కదా. ధర్మవరంలో ఎక్కడ చూసినా నీ అక్రమాలు బయటపడుతున్నాయి.

Paritala Shriram's Serious Press Meet on MLA Kethi Reddy's Corruption
Paritala Shriram’s Serious Press Meet on MLA Kethi Reddy’s Corruption

ఏ సందు కెళ్ళిన ఏ గొందులోకి వెళ్ళినా నువ్వు చేసిన అవినీతి మొత్తం జనాలు చర్చించుకుంటున్నారు. కచ్చితంగా వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. నువ్వు చేసిన అవినీతి నుండి నిన్ను ఎవ్వరు తప్పించలేరు అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పై పరిటాల శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకమైన సీట్ నియమించి ఎమ్మెల్యే కేతిరెడ్డి అవినీతి మొత్తం బయట పెడతామని హెచ్చరించారు. చెరువులు కబ్జా చేసిన దానిలో… బినామీల పేరిట ఆస్తులు ఇంకా రైతులను బెదిరింపులకు గురి చేసినట్లు పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు.

నాకు మా కుటుంబంలో గౌరవంగా మాట్లాడటం నేర్పించారు అని కేతిరెడ్డి వ్యాఖ్యలపై పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. నువ్వు గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. నువ్వు ఇతరులపై సెటైర్లు వేసుకుంటూ పొద్దుపొద్దున్నే వీడియోలలో కనిపిస్తుంటావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు వైసీపీ ప్రజాప్రతినిధుల చేతిలో ఇరుక్కుపోయి సామాన్యులకు పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. కేతిరెడ్డి అక్రమాలు ధర్మవరం ప్రజలందరికీ తెలుసు అనీ స్పష్టం చేశారు. ఏదైనా ఎక్కువ కాస్త మాట్లాడితే మీ కథలన్నీ ఒక్కొకటి బయటకు తీసుకొస్తామంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డికి పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.