Paritala Siddhartha : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రలో జిల్లా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. పరిటాల రవి చిన్న కొడుకు పరిటాల సిద్ధార్థ కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొని.. నడవటం జరిగింది. ఒకపక్క పరిటాల శ్రీరామ్ మరోపక్క పరిటాల సిద్ధార్థ మధ్యలో లోకేష్ నడుస్తూ ఉండటంతో అనంతపురం జిల్లాలో.. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చే.. ప్రతి సమస్యను లోకేష్ ఓపికగా వింటున్నారు. అన్ని వర్గాల ప్రజలు లోకేష్ కి తమ బాధలు చెప్పుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఈ పాదయాత్రకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రీరామ్ సహా మిగతా నాయకులు మరియు పరిటాల రెండో కొడుకు సిద్ధార్థ… లోకేష్ వెంట నడుస్తూ… కార్యకర్తలలో జోష్ నింపడం జరిగింది. ఈ వీడియోకీ భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కామెంట్లు పెడుతున్నారు.తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పరిటాల రవి ఒక సంచలనం.
అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పరిటాల రవి పేరు చెబితే ప్యాంట్లు తడిసిపోయే పరిస్థితి. ఇటువంటి క్రమంలో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత పరిటాల రవి మరణించాక రాయలసీమలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఈ క్రమంలో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో పరిటాల రవి ఇద్దరు కొడుకులు నడవటం వైరల్ అవుతుంది. గత సార్వత్రిక ఎన్నికలలో రాప్తాడు నియోజకవర్గం లో పరిటాల శ్రీరామ్… ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఈసారి మళ్లీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.