Amaravathi : నేడు అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 1200వ రోజులకు చేరుకోవటంతో పలు రాజకీయ పార్టీల నేతలు రైతులకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను విజయం సాధించడానికి కృషిచేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని అన్నారు. ఈ క్రమంలో అమరావతి రైతుల ఉద్యమం పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న మహిళలు మాదిరిగా… ప్రపంచంలో ఏ మహిళా కూడా పాల్గొనలేదని స్పష్టం చేశారు. తాను ఉద్యమం ప్రారంభంలో వచ్చిన సమయంలో ఆడవాళ్ల.. ముఖ కవళికలు ఒకలా ఉంటే… ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని వ్యాఖ్యానించారు.
ఇంతగా మహిళల ఘోష వైసిపి మూట కట్టుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని… చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక రాజధాని ఎక్కడికి తరలిపోదని అమరావతి నిర్మాణం పునర్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ కాదు తెలుగుదేశం పార్టీయే 175 స్థానాల్లో గెలుస్తుందని.. బాబు గారు సీఎం అవుతారని పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ మహిళలు ఉద్యమం చేస్తున్న సమయంలో.. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలు చేశారు.
భోజనానికి కల్యాణ మండపం ఇవ్వకుండా టాయిలెట్స్ కి ఏర్పాట్లు చేయకుండా… ఉన్నవాటిని తీసేసి అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల మంది రైతులు..ఇలాగా ఉద్యమం చేయటం చాలా బాధాకరం. ఎమ్మెల్సీ ఎన్నికలలో దాదాపు 108 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇప్పటికైనా వైసీపీలో చలనం రావాలి. రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల స్పందించాలని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పులివెందులలో సైతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం జరిగిందని.. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.