Panchumarthi Anuradha : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కి అనూహ్య ఫలితం వచ్చింది. వైసిపిని వెనక్కి రెడ్డి టిడిపి విజయకేతనం ఎగురవేసింది.. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఓటింగ్లో పంచుమర్తి అనురాధ గెలిచారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధా విజయం సాధించడంతో వైసీపీ ఆరు సీట్లకే పరిమితమైంది. ఊహించని విధంగా అధికార వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది. ఆ ఓట్లు వేసింది ఎవరో తెలుసుకొని జగన్ వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా సమాచారం. కాగా వాళ్లే వైసిపి నుంచి తప్పుకొని టిడిపిలోకి చేరే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
టీడీపీకి సాంకేతికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా… నలుగురు వైసీపీకి దగ్గరయ్యారు. దాంతో ఆ సంఖ్య 19కి పడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 22 ఓట్లు కావాలి. వైసీపీ నాయకత్వంతో విబేధించిన ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి ఓటింగ్ చేసినట్లు స్పష్టం అవుతోంది. వీరితో పాటుగా మరో రెండు ఓట్లు టీడీపీకి అదనంగా పోలయ్యాయి. దీంతో ఒక ఓటు తక్కువగా ఉన్న అనురాధా అదనంగా మరో ఓటు సాధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారు. కాగా వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేసిన ఆ ఇద్దరు ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.
అనురాధా గెలుపుతో వైసీపీ నుంచి పోటీ చేసిన ఒక అభ్యర్థి ఓటమి ఖాయమైంది. అనురాధకు ఆనం, కోటం రెడ్డితో పాటుగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఒక మాజీ సీనియర్ నేత పేరు బలంగా వినిపిస్తోంది. ఈయనతో పాటు వైసీపీకి చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా ప్రచారంలో ఉంది.ఈ ఎన్నికల్లో ముందు నుంచి సీఎం జగన్, చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన మరో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పేరు కూడా ప్రచారం సాగుతుంది. ముందు నుంచి కూడా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామన్న వైసీపీకి ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఫలితాలు, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఫలితాలతో వైసీపీ ఒక విధంగా ఆత్మరక్షణలో పడింది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ టీడీపీకి ఈ ఫలితం బూస్టప్‌గా మారింది.
వైసీపీ నుంచి నాలుగు ఓట్లు టిడిపికి పోల్వటంతో ఆ పార్టీ అధినేత జగన్ వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అందుకని ఆ నలుగురు నేతలతో పాటు మరికొంతమంది వైసీపీ నుంచి విడిపోవాలని ఆ తరువాత టిడిపిలోకి రావాలని ముందుగానే మంతనాలు జరుపుతున్నారని సమాచారం. అనూహ్య పరిస్థితుల్లో కూడా టిడిపి నుంచి అనురాధ గెలవడంతోనే వారికి నమ్మకం రావడంతో. వెంటనే టిడిపిలోకి షిఫ్ట్ అవుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.