NTR : దగ్గుబాటి ఫ్యామిలీ ఇపుడు ఫుల్లు కన్ఫ్యూజన్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ ఎన్నికల్లో దిగాలని డిసైడ్ అయ్యారట. అయితే ఎక్కడి నుండి పోటీచేయాలనేదే ఇపుడు కన్ఫ్యూజన్. ఎందుకంటే మొదటినుండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీచేస్తున్నది ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ నుండే. అయితే వివిధ కారణాల వల్ల ఆయనకు నియోజకవర్గంతో గ్యాప్ వచ్చేసింది.
చాలాకాలం తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పర్చూరులో పోటీచేసినా దగ్గుబాటి ఓడిపోయారు. దాంతో ఇపుడు ఆ నియోజకవర్గంపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్ధితి. ఇపుడు దగ్గుబాటి కుటుంబానికి సమస్య ఏమిటంటే చాలాకాలంగా దూరమైపోయిన టీడీపీతొనే మళ్ళీ అడుగులు వేయాల్సొస్తోంది. ఎన్టీయార్ కు వెన్నుపోటు విషయంలో తొడల్లుళ్ళు దగ్గుబాటి, చంద్రబాబునాయుడు కలిసే పనిచేసినా తర్వాత విభేదాలొచ్చి విడిపోయారు.

దాదాపు పాతికేళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరు కలుస్తున్నారు. ఏవో ఫంక్షన్లలో కలుసుకోవటం మొదలై ఇపుడు రెగ్యులర్ గా కలుసుకునేదాక వచ్చారట. అందుకనే తన కొడుకు చెంచురామ్ ను దగ్గుబాటి మళ్ళీ టీడీపీ తరపున పోటీచేయిద్దామని అనుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఓకే చెప్పారట. చంద్రబాబు, లోకేష్ తో చెంచురామ్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే నియోజకవర్గమే లేకుండా పోయింది. పర్చూరు నుండే పోటీచేయిద్దామని అనుకుంటే సిట్టింగులకే సీట్లని చంద్రబాబు ప్రకటించటంతో అవకాశం లేకపోయింది. పోనీ చీరాల నుండి పోటీ చేయిద్దామని అనుకున్నారట.
ఈమధ్యనే జరిగిన సమీక్షలో చీరాలలో కొండయ్యే ఇన్చార్జిగా ఉంటారని ప్రకటించేశారు. మరి రేపటి ఎన్నికల్లో కొండయ్యకే టికెట్ ఇస్తారో లేదో తెలీదు కానీ ఇప్పటికైతే దగ్గుబాటి ఫ్యామిలీకి అవకాశం లేకపోయింది. అటు పర్చూరు లేక ఇటు చీరాల నమ్మకం లేకపోవటంతో ఇంకెక్కడి నుండి పోటీచేయాలి ? అన్నదే అతిపెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. మరికొంత కాలం ఇలాగే కంటిన్యు అయితే చివరకు మొదటికే మోసం వస్తుందేమోనని దగ్గుబాటిలో టెన్షన్ మొదలైందట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.