Vizag public Opinion : 2024 ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడక్కుతున్నాయి.. జగన్ ఎలా ఉంది.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకే ఇస్తారా.. ఆయన సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది.. ఈసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తారా.. జనసెన కి అధికారం ఇస్తారా అని పబ్లిక్ టాక్ నిర్వహించగా.. పలువురు వారి అభిప్రాయాలను వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం పథకాల అమలు ద్వారా ప్రజలు సోమరి అవుతున్నారని.. పథకాల ద్వారా ఎన్నికలలో గెలుస్తామని అనుకోవడం భ్రమ అని అన్నారు. ఈ సారి యువనేత పవన్ కళ్యాణ్ కి అవకాశం వస్తె బాగుంటుందని ఒక అతను తన అభిప్రాయాన్ని తెలిపాడు. మరొక వ్యక్తి తన అభిప్రాయాన్ని చెబుతూ ఇప్పటివరకు జగన్ తెలుగుదేశం పార్టీల అనుభవాలను చూసాం.. ఈసారి కొత్తవారికి అవకాశం ఇస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.. అందులో భాగంగా జనసేన వస్తే చూడాలని కూడా ఉందని తెలిపాడు.
జనసేనకి మరొక అతను కూడా మద్దతు తెలుపుతూ.. జగన్ పిచ్చి పిచ్చి పథకాలతో అందరి ముందుకు వస్తున్నాడు. కానీ ఆ పథకాలు ఆయన్ని నిలబెట్టలేవు ఎందుకంటే సంక్షేమ పథకాలతో పాటు యువతికి ఉపాధిని కూడా కలిగించాలి. ఈయన వచ్చిన తరువాత ఒక్క మంచి జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల లేదని గుర్తు చేశారు. మరొక వ్యక్తి మరోసారి చంద్రబాబు వస్తే చాలా బాగుంటుందని ఆయన విజన్ ఉన్న వ్యక్తి అని విజన్ ఉన్నవాళ్లు వస్తే చాలా బాగుంటుందని..
ఇప్పటికే మన నెట్టే మీద కుంపటిలాగా అప్పుల భారం రోజురోజుకీ పెరుగుతోందని అది బయటకు తీసే మార్గమే టిడిపి అని మరొక అతను తన అభిప్రాయాన్ని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే జగన్ ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు. ఆయనకి మరొక అవకాశం ఇస్తే ఇప్పుడు వేసిన విత్తనాలన్నీ మొలకెత్తి ఫలాలని ఇస్తాయి. కచ్చితంగా జగనే రావాలి ఆయనే వస్తారని మరొక అతను తన అభిప్రాయాన్ని తెలిపారు.
అదేవిధంగా ఇప్పుడున్న మూడు పార్టీలలో కూడా జగన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని.. ఇక కొత్తవారు రావటానికి కాస్త సమయం పడుతుంది అని.. ఈసారి కూడా జగన్ రావడం తద్యమని మరొక అతను తన అభిప్రాయాన్ని తెలిపారు. వైజాగ్ బీచ్ దగ్గర ఉన్న కొంతమందిని వచ్చే సీఎం ఎవరు అని అడగగా.. వారి వారి అభిప్రాయాలను తెలిపారు. ఈ వీడియోలో ఇంకాస్త స్పష్టంగా వారి అభిప్రాయాలను మాటలను తెలుసుకోవచ్చు…