YCP MLA వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వాక్యాలు చేశారు.ఈ మేరకు శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వైసిపి లో నేతలు బానిసల్ల బతుకుతున్నారని వాక్యానించారు.ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దేశ చరిత్రలోనే సస్పెన్స్ థ్రిల్లర్ అని చంద్రబాబు అన్నారు. ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు దేశంలో మరొకటి లేదన్నారు.ఇలాంటి కేసులో న్యాయం జరగకపోతే వ్యవస్థల మీదే నమ్మకం పోతుందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద దోపిడీదారు అని ఆయన పేదల ప్రతినిధి కానే కాదని విమర్శించారు.
ఇక ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి ఉన్న 23 మంది సభ్యుల బలంతోనే తాము ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకున్నామని చంద్రబాబు చెప్పారు.తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన వైసిపి తిరిగి తమపైనే నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపి నుంచి ఏ ఎమ్మెల్యే వచ్చిన రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ అసెంబ్లీలోని అనలేదా.? అని చంద్రబాబు గుర్తు చేశారు. ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసిపికి షాప్ ట్రీట్మెంట్ ఇచ్చారని చంద్రబాబు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాశ్వత చికిత్స చేస్తారని వాక్యానించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కైవసం చేసుకున్నారు.దాంతో వైసిపి నాయకులలో ఓటమి భయం నెలకొంది. సీఎం జగన్ 175 సీట్లు తమవేనని హుందాగా గర్వంగా ప్రకటించారు.కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వారు నాలుగు సీట్లు కోల్పోవడం జరిగింది. అందులో నమ్మిన వారే మోసం చేశారు. ఇక ఇప్పుడు వారికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి సీట్లు వస్తాయని నమ్మకం కూడా లేకుండా పోయింది. మరోపక్క వైసీపీ ఎమ్మెల్యే జనాలలో పర్యటిస్తున్న సమయంలో ఒకపక్క జనాలు వెళ్లిపోతున్నారు. మరోపక్క ఓటమి టెన్షన్స్ పెరిగింది.దీంతో ఒక వైసీపీ ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఫ్లోలో చెప్పేసిన వైనం ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.