BalaKrishna : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు లోకేష్ పాదయాత్రని బాగా సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర స్టార్ట్ అయిన సమయంలో సందడి చేసిన బాలయ్య మళ్ళీ ఇటీవల లోకేష్ తో కలిసి అడుగులు వేయడం జరిగింది. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వం పై అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ పై తనదైన శైలిలో మండిపడ్డారు. ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడకుండా స్వార్ధ రాజకీయాలు చేసుకుంటున్నారని విమర్శించారు. సైకో నిర్ణయాలు తీసుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో లోకేష్ ప్రజలతో కలిసి మాస్క్ పెట్టుకోకుండా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. దీంతో ఆయన కరోనాకి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. ఊహించని విధంగా ప్రజలు పాదయాత్రలో లోకేష్ కి బ్రహ్మరథం పడుతూ ఉండటంతో… కరోనా సోకినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలోనే నారా చంద్రబాబు నాయుడు ఇంకా లోకేష్ కరోనా బారిన పడటం జరిగింది. రెండు సంవత్సరాల క్రితం దేశంలో కరోనా కేసులు విలయతాండవం సృష్టించటం తెలిసిందే.
ఆ సమయంలో కరోనా బారిన పడటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ లోకేష్ కరోనా భారీన పడినట్లు ప్రచారం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్రకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. లోకేష్ వైసీపీ నాయకులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. స్థానిక వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసే పనులను లోకేష్ వివరిస్తూ ఉన్నారు.