Global Investors Summit 2023 : మాయేరా.. మాయేరా.. లక్షల కోట్లు మాయేనా.?

Global Investors Summit 2023 : రాష్ట్రంలో 2 రంగాల్లో 340 పెట్టుబడిదారులు రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ శిఖరాగ్ర సదస్సులో శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. మొదటి రోజు 92 ఎంఎంవో ఇలా ద్వారా ఒప్పందాలు జరిగినట్లు వివరించారు. పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో తమ సంస్థల కార్యకలాపాలు తెలిపారు. కొంతమంది వేదిక పైన ఎంత మేరకు పెట్టుబడులు పెడతారో కూడా ప్రకటించారు. అయితే ఈ విషయంపై డిబేట్ నిర్వహించగా పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

బాలకోటయ్య , ఆర్థిక విశ్లేషకులు కుటుంబరావు మాట్లాడుతూ.. ఇక్కడ ప్రదానంగా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీలన్నింటికీ నాలుగున్నర లక్షల ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్థలాన్ని ఎక్కడి కేటాయిస్తారు. ఇవన్నీ పేపర్ పైన అగ్రిమెంట్లు మాత్రమేనా చేయడానికి ముందే ఇది ఒక అగ్రిమెంట్ గా చేశారా ఈ స్కెచ్ ని రానున్న ఆరేడు నెలలో అగ్రిమెంట్ గా చేస్తారా.. ఒకవేళ ఆ తరువాత మరో ప్రభుత్వం వచ్చినా కూడా డెఫినిట్ భూములన్నింటినీ ఎలిగేషన్ లో పెట్టాలని అనుకుంటున్నారా ఒక కంపెనీ కోసం కేటాయించామని సంతకాలు కూడా చేసేస్తే వాటిని ఎవరు అధికారికంగా ఏం చేయలేరు కాబట్టి ఏదో విధంగా ప్లాన్ చేశారా అని .. భూసంతర్పణకి ఇన్ డైరెక్టుగా కూడా అర్థమవుతుంది.

చాలా క్లియర్ గా వీళ్ళ ప్లాన్ ఏంటో అర్థం అవుతోంది. ఒక స్కాం చేసే వాళ్ళు మాత్రమే ఇంత పకడ్బందీగా మరో స్కాం కోసం ప్లాన్ వేరు అది కూడా మనం గమనించాలి అని కుటుంబరావు అన్నారు. ఎలక్షన్స్ ముందు కావాలని ఇలా చేస్తున్నారని ఇదే ఒక వాలుగా నిర్మించుకునేటట్లయితే కచ్చితంగా తప్పటడుగు వేశారు అని కుటుంబరావు అన్నారు.

బాలకోటయ్య మాట్లాడుతూ ఇండస్ట్రియల్ వచ్చిన గ్లోబల్ సమితికి ఫుడ్ దొరకక వాళ్లు కొట్టుకోవడం ఏంటండీ.. ఇదంతా ఎంత విచిత్రంగా ఉంది. ఒకవేళ నిజంగా వాళ్లే కనుక లక్షల కోట్లు వెచ్చిస్తుంటే ఏర్పాట్లలో ఏ చిన్న లోటు రాకుండా చూసుకుంటాము. అలాంటిది ఇన్ని లక్షల కోట్లు మన ప్రభుత్వానికి మన గవర్నమెంట్ కి వస్తున్నాయి అంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అర్థమవుతుంది. వాళ్ళకి మర్యాదలే సరిగ్గా చేయలేదంటే ఆ అదంతా పెద్ద భూటకమని స్పష్టంగా అర్థమవుతుంది అంటూ బాలకోటయ్య అన్నారు. ఏది ఏమైనా ఈ లక్షల కోట్లు రావడం అనేది ఒక మాయ లాగా ఉందని అంత అంటున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.