TDP : రాజకీయంగా వైసిపిలోని ఒకరికొకరు సవాళ్లు చేసుకోవడం వాళ్ళ కన్ను వాళ్లే పొడుచుకోవడం ఇవన్నీ కూడా టీడీపీకి బలం ఇచ్చినట్లే.. పదికి పది సీట్లు ఇచ్చిన వైసిపి ఈసారి సగం కూడా ఉండదు. టిడిపి గెలిచే అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా అనుమానాలు. చంద్రబాబు గారి దృష్టి నెల్లూరు జిల్లా మీద ఉంది అంటున్నా అధికారులు. మొదటగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఆనం ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోటీ చేయడం జరుగుతుంది.

నెల్లూరులో శ్రీలహరి గారి పేరు వినిపిస్తోంది. ఆయనకే సీటు ఇస్తారు.అంటున్న సమాచారం. అదేవిధంగా నెల్లూరులో నారాయణ 2019లో మాజీ మంత్రి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం వలన ఆయన మీద కొంచెం సింపతి ఉంది. కావున ఆయన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గూడూరు నియోజకవర్గం నుంచి పాశం సునీల్ గారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. కావలిలో ప్రస్తుతం ఉన్న ఇన్చార్జి సుబ్బరాయుడు గారికి సీటు ఇచ్చేది లేనిది కన్ఫామ్ గా లేదు 50 50 ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు.
రెడ్ సమాజం నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. బీద రవిచంద్ర గారికి పార్టీ కోసం ప్రజలు అడుగుతున్నప్పటికీ ఆయన ప్రత్యక్ష రాజ్యాల వైపు మొక్కు చూపడం లేదు. ఉదయగిరిలో ప్రస్తుతం ఇన్చార్జి రామగిరి గారు ఉన్నప్పటికీ ఎన్నారై కాకర్ల సురేష్ గారు కూడా ట్రస్ట్ పేరుతో ఉన్నారు.అయితే వీరిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో పనబాక లేదా నెలవర వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి కన్ఫామ్ చేసే అవకాశం ఉంది. వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారావు గారు లేదా రాజ యసేంద్ర గారికి ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అంటున్నారు.