Nara Lokesh: తెలుగు రాజకీయాలలో ఒక సెంటిమెంట్ ఉంది. ఎవరైనా పాదయాత్ర చేశారంటే ఆ తర్వాత వచ్చే ఎన్నికలలో గ్యారెంటీగా ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకుంటారు. మొట్టమొదట ఈ పాదయాత్ర ట్రెండ్ ని మొదట వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేయడం జరిగింది. పాదయాత్ర చేసిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు “మీకోసం” అంటూ పాదయాత్ర చేశారు. పాదయాత్ర అయిపోయాక 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
ఇక జగన్ కూడా 2019 ఎన్నికలకు ముందు “ప్రజా సంకల్ప” పాదయాత్ర అని దాదాపు 3 వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత భారీ మెజార్టీతో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు టీడీపీ వర్గాలలో టాక్ నడుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసి సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు మార్చిలో ముగింపు పలికేలా ..ప్లాన్ చేశారట. దాదాపు ప్రజల మధ్య విశ్రాంతి లేకుండా 450 రోజుల షెడ్యూల్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చిత్తూరులో ప్రారంభమై ఉత్తరాంధ్రలో కంప్లీట్ అయ్యే దిశగా.. పాదయాత్ర చేయాలని లోకేష్ నిర్ణయించుకున్నారట. పాదయాత్ర రోడ్డు మ్యాప్ నీ ప్రతి ప్రాంతం సందర్శించేలా తీర్చిదిద్దడం జరిగిందట.
ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా.. లోకేష్ పక్కా ప్లానింగ్ తో పాదయాత్ర చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా 2024 ఎన్నికలలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా టీడీపీ క్యాడర్ లోకేష్ పాదయాత్ర సక్సెస్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దసరా నవరాత్రుల తర్వాత ప్రజల మధ్యకు రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరగనున్నారు. పవన్ క్యాంపెయిన్ కి సంబంధించి స్పెషల్ వెహికల్ కూడా ఇప్పటికే భారీ హంగులతో తయారు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ దాదాపు రెండు నెలలపాటు.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు సమాచారం. దీంతో పవన్ యాత్ర కంప్లీట్ అయిన వెంటనే లోకేష్ పాదయాత్ర స్టార్ట్ కానుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దసరా తర్వాత వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.