Nara Lokesh : టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలపై తనదైన శైలిలో లోకేష్ మండిపడుతున్నారు. తాజాగా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి లోకేష్ సెల్ఫీ చాలెంజ్ విసరటం జరిగింది. కొండపై అక్రమంగా ఫామ్ హౌస్ కేతిరెడ్డి కట్టుకున్నట్లు… కొండను తొలిచి రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నట్లు.. లోకేష్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమంగా చెరువును తవ్వేసి కొండను ఆక్రమించుకున్నట్లు… లోకేష్ తోపాటు పరిటాల శ్రీరామ్ ఆరోపించడం జరిగింది.

అక్కడ కుర్రాల రేసింగ్ తో పాటు అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు పరిటాల శ్రీరామ్ నారా లోకేష్ దృష్టికి తీసుకురావడం జరిగింది. “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారు. అయితే తాను మాత్రం గుట్టలను దోచేస్తాడు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు.
902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను అక్రమించాడు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే గారి విలాస కార్యక్రమాలకు అడ్డా అని లోకల్ టాక్..అంటూ నారా లోకేష్ సోషల్ మీడియాలో మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర చాలా విజయవంతంగా జరుగుతుంది. పరిటాల శ్రీరామ్ కుటుంబ సభ్యులతో పాటు చాలామంది జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొంటున్నారు. అన్ని వర్గాల ప్రజల బాధలను లోకేష్ చాలా ఓపికగా వింటున్నారు.