TDP Pileru : సమరానికి సిద్ధం.. టిడిపి పీలేరు అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ ని ఎనౌన్స్ చేసిన నారా లోకేష్..

TDP Pileru : యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.. ఏ నియోజకవర్గంలోనైనా సరే బహిరంగ సభ జరిగిన తరువాత ఆ నియోజకవర్గ ఇన్చార్జి బారా కాద న్న సమయంలో ప్రజలు ఉంటారు కానీ నారా లోకేష్ అందుకు భిన్నంగా టిడిపి అభ్యర్థి వీళ్లే అంటూ ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని అనౌన్స్ చేశారు


ఈ సభలో సీఎం జగన్ ఓ కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సీఎం జగన్ పాలనలో ముస్లింలు కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని.. ఆక్రమంగా ఇసుకను ఏపీ నుండి బెంగళూరుకి తరలిస్తున్నారని ఆరోపించారు. హంద్రీనీవా సహా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని చెక్ డ్యాములు కొట్టుకుపోతే కనీసం మరమ్మత్తులు చేయలేదని ధ్వజమెత్తారు. ఇక ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని లోకేష్ ప్రకటించారు. టిడిపి నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి టిడిపి తరఫున బరిలోకి దిగుతారని పీలేరు బహిరంగ సభలో లోకేష్ ప్రకటించారు. కాగా చిత్తూరు జిల్లాలో ఇప్పటికే టిడిపి పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే..

ఈ విషయంపై అక్కడికి వచ్చినా కొందరిని వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకోగా.. ముందుగా అభ్యర్థిని అనౌన్స్ చేస్తే ఎక్కువ మెజారిటీతో వాళ్లు గెలుస్తారని తెలిపారు.. 50 వేల మెజారిటీతో పీలేరు అభ్యర్థిని గెలిపించుకుంటామని తెలిపారు. నారా లోకేష్ పీలేరు అభ్యర్థిని ముందుగా అనౌన్స్ చేసి మంచి పని చేశారని తెలిపారు. మంచి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అక్కడివారు.

అలాగే ఒక ముస్లిం నాయకుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముస్లిమ్స్ కి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని.. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం అసలు ముస్లిమ్స్ ను పట్టించుకోవడంలేదని అన్నారు. మళ్ళీ టిడిపి కచ్చితంగా వస్తుందని తెలిపారు. టిడిపి అధికారంలోకి వస్తే మళ్లీ ముస్లింలకు మంచి జరుగుతుందని అన్నారు.