Nandamuri Balakrishna : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసంతరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉండగానే స్టేట్ లో పొలిటికల్ హీట్ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యమైన విజయం సాధించటంతో ఆ పార్టీలో ఫుల్ జోష్ నెలకొంది. ఈ క్రమంలో వైసీపీలో కొంతమంది ప్రజా ప్రతినిధులను టీడీపీ గట్టిగా టార్గెట్ చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ కీలక నాయకులను తీవ్ర స్థాయిల విమర్శించే కొడాలి నాని, పేర్ని నాని ఇంకా ఈ జాబితాలోకి వచ్చే వైద్యశాఖ మంత్రి విడుదల రజని వాటి నాయకులను లక్ష్యం చేసుకోవడం జరిగిందంట.. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో ఈ నాయకులను ఓడించాలని.. ఇప్పటినుండే టీడీపీ వ్యూహాలు వేస్తున్నట్లు సమాచారం.

దీనిలో భాగంగా మంత్రి విడుదల రజనీని ఓడించడానికి నందమూరి బాలకృష్ణ భార్య… వసుంధరనీ రంగంలోకి దింపుతున్నారట. పైగా విడుదల రజిని అమరావతి రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కావటంతో.. అమరావతి సెంటిమెంట్ ఆస్త్రాన్ని ఉపయోగించుకుని బాలయ్య భార్యని పోటీకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకి వయసు మీద పడటంతో పాటు తెలుగుదేశం పార్టీకి ఇది చాలా కీలకమైన ఎన్నికలు కావడంతో… నందమూరి కుటుంబ సభ్యులు ఈసారి భారీ ఎత్తున పోటీకి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు చివరిలో జూనియర్ ఎన్టీఆర్ సైతం తెలుగుదేశం పార్టీ ప్రచారానికి రెడీ కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో భార్యని అమరావతి పొలిటికల్ సెంటిమెంట్ ప్రాంతం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజనీపై పోటీ చేయటానికి బాలయ్య దగ్గరుండి స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.