Nandamuri Balakrishna రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా నేతగా బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ రాజకీయాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ విషయంలో ఎవరైనా ఎక్కువ మాట్లాడితే.. మెయిన్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి కాంట్రవర్సీ కామెంట్లు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతారు. అవతల వ్యక్తి ఎటువంటి వారైనా సరే.. హద్దులు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగానే నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరించిన సమయంలో బోరుగడ్డ అనిల్ కుమార్ నేరుగా ఆయనకి ఫోన్ చేసి బెదిరించడం ఆ ఫోన్ కాల్ రికార్డు కావడం తెలిసిందే. ఈ రకంగా ఎవరి భయపడితే వారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వారిపై నోరేసుకుని పడిపోతున్న బోరుగడ్డ అనిల్ కుమార్ కి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా హై కమాండ్ ఊహించనీ షాక్ ఇవ్వటం జరిగిందట. అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఎవరో కూడా తమాకు తెలియదని పార్టీ సభ్యత్వం మొత్తం రద్దు చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ పేరు చెప్పి ఇతర పార్టీకి కొమ్ము కాస్తూ ఇష్టానుసారమైన బూతులు తిడుతూ విమర్శించడం పట్ల.. రిపబ్లికన్ పార్టీ పెద్దలు మండిపడినట్లు తెలుస్తోంది. అయితే బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉండటంతో పాటు గతంలో చంద్రబాబుని అవకాశం వస్తే లేపేస్తానని అనటంతో.. తాజా పరిస్థితిపై బాలకృష్ణ స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తుల వల్ల సమాజంలో విద్వేషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. బాలకృష్ణ హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే బోరుగడ్డ అనిల్ వెనకాల కీలకమైన నాయకులే ఉండి ఉంటారని అంటున్నారు. రిపబ్లిక్ పార్టీ అని చెప్పుకుంటూ వైసీపీలో తిరుగుతున్నాడు. అతను నిజంగా జగన్ అభిమాని కాబట్టే… ఎన్ని దుశ్చర్యలకు పాల్పడిన జైల్లో.. వేయకుండా తిరగనిస్తున్నారని అంటున్నారు. అసలు అతనికి రిపబ్లిక్ పార్టీ విలువలు తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. రిపబ్లిక్ పార్టీలో ఎవరూ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ మాదిరిగా ఉండరని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.