MP Rammohan Naidu : నేడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు.. కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో బహిరంగ సభలో ఎంపీ రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం హైలైట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ పాదయాత్ర 50 రోజులకే.. ఏపీ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో.. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో…టీడీపీ ఘన విజయం సాధించింది. లోకేష్ పాదయాత్ర పూర్తి అయ్యేసరికి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం జగన్ ప్రతిసారి ఢిల్లీ వెళ్లడానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా ఇంకా రైల్వే జోన్ గురించి అడగడానికి కాదు.

బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కాలభేరం కోసం వెళ్తున్నారని ఆరోపించారు. ఈ రీతిగా తెలుగుజాతి పరువును ఢిల్లీలో తాకట్టు పెట్టేందుకు వెళ్లారని సీఎం జగన్ టూర్ పై సెటైర్లు వేశారు. ప్రపంచంలో తెలుగు జాతి గర్వపడేలా తెలుగుదేశం పార్టీ సత్తా చాటిందని పేర్కొన్నారు. తెలంగాణ గాలిలో నెలలో తెలుగుదేశం పార్టీ ఉందని రెండు తెలుగు రాష్ట్రాలలో సామాజిక న్యాయం జరగాలంటే టిడిపి తోనే సాధ్యమని పేర్కొన్నారు. 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు దూసుకెళ్లినట్టుగానే టిడిపి పార్టీ కూడా రాజకీయాల్లో దూసుకుపోయిందని వివరించారు.
హైదరాబాదులో మాదిరిగా అమరావతికి పునాదులు చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. 2024లో టీడీపీ గెలుపును ఎవరు ఆపలేరని… వివరించారు. తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకే జగన్ పై నమ్మకం లేదని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి వై నాట్ 175 అంటున్నారు. వై నాట్ పులివెందుల అని… సవాలు విసిరుతున్నాం. ఒకటో నెంబర్ జీవో తెచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.