YS Viveka Case : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఏప్రిల్ 30వ తారీఖు లోపు ముగించాలని సిబిఐ దర్యాప్తు సంస్థకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో అంతకుముందు కేసును టేకప్ చేసిన సిబిఐ కీలక అధికారిని కూడా మార్చడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డినీ సీబీఐ మూడుసార్లు విచారించటం సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగిన నాటి నుండి అవినాష్ రెడ్డి పేరును ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ ఉన్నాయి. 2019 కడప ఎంపీ టికెట్ కోసం సొంత బాబాయ్ ని చంపించినట్లు కామెంట్లు చేయడం జరిగింది.

ఇలాంటి తరుణంలో ఈ కేసుకు సంబంధించి విచారణ కీలక దశలో ఉండగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విచారణ ముగిసిన అనంతరం 72 గంటల్లో అరెస్టులు ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కేసులో భారీ కుట్ర కోణం ఉందని సుప్రీం చెప్పటంతో కచ్చితంగా… విచారణ ముగిసిన అనంతరం 72 గంటలలోనే అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ కేసుకు సంబంధించి సిబిఐ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు కేంద్ర పెద్దలే తెలియజేయడం జరిగింది. సుప్రీమ్ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుందని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. వివేక హత్య కేసు జరిగిన సమయంలో గూగుల్ టేక్ అవుట్… ఆధారంగా చూస్తే హత్యకు ముందు.. హత్య జరిగిన తర్వాత కీలక నేత ఇంటిని చూపిస్తూ ఉండటంతో.. పాటు సిబిఐ విచారణలో ఈ కేసులో భారీ కుట్ర ఉందని తేలింది. దీంతో విచారణ ముగిసిన అనంతరం.. అరెస్టులు గారేంటి అని రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.