Narendra Modi : ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర అత్యంత శక్తివంతమైనది అని చెప్పక తప్పని పరిస్థితి ఉంది .బీజేపీ ఏపీ లో బలమైన పార్టీ కాకపోయినప్పటికీ ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు, ప్రాంతీయ రాజకీయ నాయకులూ బీజేపీ చుట్టూ తిరిగేలా చేసుకోవడం తో శక్తివంతమైన పార్టీ గా ముద్ర వేసుకుంది. బీజేపీ తన రాజకీయ అవసరాల అనుగుణం గా ఎవరినీ దూరం చేసుకోకుండా అలాఅని ఎవరికీ దగ్గరగా లేకుండా తన రాజకీయ చతురత చూపుతోంది. ఈ కారణం గా నే పవన్ కి మోడీ అర్జంటుగా అపాయింట్మెంట్ ఇచ్చేసారు. ఇలా అనడానికి కారణం ఏమిటంటే మోడీ అపాయింట్మెంట్ కోసం పవన్ చాలా కాలం గా ఎదురుచూసి విసిగిపోయి ఇప్పుడు ఆయన దారి ఆయన చూసుకోవాలనుకుంటున్నారు అని భావించిన బీజేపీ ఆగమేఘాల మీద మోడీతో పవన్ కి సమావేశాన్ని ఫిక్స్ చేసింది .

ఈ సమావేశంలో ఎలాంటి చర్చలు జరిగిన చివరికి బీజేపీ లాభపడేలా మాత్రం ఈ భేటీ ముగుస్తుంది అని రాజకీయా విశ్లేషకులు అంటున్న మాట. అయితే పవన్ తో ప్రధాని చర్చలు జరపడం అనేది వైసీపీ కి నచ్చని పరిణామం అవుతుంది. అటు చుస్తే బీజేపీ కి కేంద్ర స్థాయిలో వైసీపీ మద్దతు అవసరం. వైసీపీ విషయంలో బీజేపీ ఆలోచనలు భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం దూరం చేసుకునే ఆలోచన కానీ అవసరం కానీ లేదు. ఈ కారణం గానే మోడీతో జగన్ సమావేశమవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. జగన్, ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం లో ఉన్నప్పుడు ఏపీ పాలనాపరమైన విషయాలని చర్చించడంతో పాటు రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ కోరుకునేది ఏమిటంటే పవన్ ని ,టీడీపీ ని బీజేపీ దూరం పెట్టాలి , 2014 పొత్తు మళ్ళి జరగకూడదు. అంటే టీడీపీ, జనసేన,బీజేపీ, కలవకూడదు అనే అజెండాతో వైసీపీఅడుగులు వేస్తుంది. 2024 ఎన్నికల తర్వాత కూడా వైసీపీ మద్దతు బీజేపీ కి ఉంటుంది అని ఈ భేటీలో జగన్ మోడీ తో చెబుతారు అని భావిస్తున్నారు.
ఇక బీజేపీ విషయం చూసుకుంటే కేంద్రంలో మూడవసారి కూడా అధికారం దక్కించుకోవడం కోసం జగన్ , పవన్ తో ఎలాంటి వ్యతిరేకత లేకుండా చాలా తెలివిగా ‘నొప్పించక, తానొవ్వక’ అనే విధం గా వ్యవహారం నడపబోతుంది అని రాజకీయ నిపుణులు అంటున్నారు.