Modi : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ నడిబడ్డున నిలబడి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారిక పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపనకు ఇచ్చారు. మోడీ సికింద్రాబాద్ తిరుపతి వందేభరత్ రైలును ప్రారంభించారు. తర్వాత పరేడ్ గ్రౌండ్ లో 13 ఎంఎంటిఎస్ రైళ్లను జాతీయ రహదారులను ప్రారంభించారు. బీబీనగర్ ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ రైల్వే లైన్ ను జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. అవినీతిపరులపై చర్యలు తప్పవని పరోక్షంగా కేసీఆర్ ఆయన కూతురు కవితను హెచ్చరించారు.అవినీతిపరులపై చర్య తీసుకోవాలా? వద్దా? అని నేరుగా వేదికపై నుంచి తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు.
టిఆర్ఎస్ పేరు ప్రస్తావించకుండా కీలక వాక్యాలు చేశారు మోదీ. అవినీతిపరులంతా ఏకమవుతున్నారని ఆరోపించారు. ప్రియమైన సోదర, సోదరీమణులారా.. అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సికింద్రాబాద్ మరియు తిరుపతి మధ్య వందే భారత్ రైలును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి నగరంతో కలిపామని అన్నారు. కరోనా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచం తిరోగమనంలోకి వెళ్ళింది. భారత్ మాత్రం ప్రగతి ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. బడ్జెట్లో ఈ ఏడాది మౌలిక వసతుల కల్పన కోసం రూ. 10 లక్షల కోట్లు కేటాయించాం. రాష్ట్రంలో 35 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం. జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్రంలో భారీ టెక్స్టైల్స్ పార్క్ నిర్మించుకున్న టెక్స్టైల్స్ పార్కుతో రైతులు, కార్మికులకు ఎంతో ఉపయోగం. తొమ్మిదేళ్లలో భారత్ రూపురేఖలు సమూలంగా మార్చం.దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగం అయ్యేలా చేశాం.
హైదరాబాదులో ఎంఎంటిఎస్ సేవలు విస్తరిస్తున్నాం. ఒక్కరోజే 13 ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం.సికింద్రాబాద్- మహబూబ్నగర్ రైల్వే డబ్లింగ్ పనులు పూర్తి చేసాం. తెలంగాణలో హైవే నెట్వర్క్ ను కూడా వేగంగా అభివృద్ధి చేస్తున్నాం.హైదరాబాదు- బెంగుళూరు అనుసంధానాన్ని మెరుగుపరుస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలి. అని కోరారు..