panchumarthi Anuradha : నా ట్రాక్ రికార్డ్ తెలుసుకొని మాట్లాడండి పంచుమర్తి అనురాధ వైసిపి కి స్ట్రాంగ్ కౌంటర్..

panchumarthi Anuradha :  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసిన పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రస్థానం అనూహ్యంగా మొదలైంది. 2000 సంవత్సరంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సీటు బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో నాటి అధికార పార్టీ టీడీపీ అక్కడ బీసీ మహిళా అభ్యర్థి కోసం అన్వేషిస్తోందని తెలియడంతో.. ఎలాంటి రాజకీయ అనుభవం లేని అనురాధ మేయర్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మేయర్‌ టికెట్‌ కోసం 18 మంది పోటీ పడినా విద్యాధికురాలు కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు టికెట్‌ ఇచ్చారు.. అనురాధ మేయర్‌గా ఎన్నిక కావడం జరిగిపోయింది. అప్పటికి ఆమె వయసు 26 సంవత్సరాలు. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆమె పేరు ఇప్పటికీ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో నమోదై ఉంది. ఈ నేపథ్యంలో పంచుమర్తి అనురాధ పై వైసీపీ కుర్రాళ్ళు కొంతమంది ఆమెను టార్గెట్ చేస్తూ నెగిటివ్ ప్రచారం చేశారు. ముందు నా ట్రాక్ రికార్డర్ తెలుసుకొని అప్పుడు నన్ను విమర్శించండి. ఆర్థిక ఉగ్రవాది అనే పదాన్ని నేను మాత్రమే ఉపయోగించలేదు సిబిఐ ఉపయోగించిన తరువాతే మేము మాట్లాడాము అని పంచుమర్తి అనురాధ అన్నారు. అలాగే ఆమె ట్రాక్ రికార్డును కూడా చెప్పుకొచ్చారు.

Mlc leader panchumarthi Anuradha words ycp
Mlc leader panchumarthi Anuradha words ycp

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 2000 సంవత్సరంలో ఎన్నికలలో మేయర్‌ పదవికి డైరెక్టు ఎన్నిక కావడంతో అనురాధ మేయర్‌గా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌, సీపీఐ తరఫున ఉద్దండులైన అభ్యర్థులను ఢీకొని ఆమె 6 వేల ఓట్ల ఆధిక్యంతో మేయర్‌గా ఎన్నికయ్యారు. కానీ 50 డివిజన్లలో టీడీపీకి కేవలం 9 స్థానాలు మాత్రమే దక్కాయి. అయినా ఐదేళ్లపాటు మేయర్‌గా అద్భుతంగా పనిచేశారు ఐదుగురు కమిషనర్లను మార్చారు.
చేనేత సామాజిక వర్గానికి చెందిన అనురాధకు 2015లోనే ఎమ్మెల్సీ పదవి దక్కాల్సి ఉంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నామినేషన్‌ వేసేందుకు పత్రాలు లేకపోవడంతో చివరి నిమిషంలో ఆ ఎమ్మెల్సీ సీటును ప్రతిభాభారతికి కేటాయించారు. పదవులతో సంబంధం లేకుండా అనురాధ పార్టీకి నమ్మినబంటుగా ఉంటూ వచ్చారు.

ఒకానొక దశలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె ఇక రాజకీయాలకు స్వస్తి చెబుతారని అంతా భావించారు. కానీ ఆమె క్యాన్సర్ ను కూడా చేయించారు. ఆ సమయంలో ఫైనాన్స్ కార్పొరేషన్ లో ముఖ్యమైన పదవిలో ఉన్నా కూడా ఆమె క్యాన్సర్ కి అయినా ఖర్చులు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని గుర్తు చేశారు. 23 లక్షల రూపాయలు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు అవ్వగా అవి నా సొంత డబ్బులతో నేనే భరించాను. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదని ఆమె తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఆమె సేవలను గుర్తించి పార్టీ అధినేత 2015లో ఆంధ్రప్రదేశ్‌ మహిళా కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. ప్రస్తుతం ఆమె టీడీపీ జనరల్‌ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా ఉన్నారు. పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు ధైర్యంగా ప్రెస్‌మీట్లు పెట్టి వైసీపీని విమర్శించి అధినేత దృష్టిని ఆకర్షించారు అనురాధ.

అటువంటి నన్ను వైసిపి కుర్రాళ్ళు తక్కువ చేసి నెగిటివ్గా ప్రచారం చేస్తుంటే ఆ పార్టీ అధినేత చూస్తూ ఉండిపోయారు.. ఒక మహిళకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదని రాయలసీమ బిడ్డగా చెప్పుకునే పరిటాల సునీతను ఆ పార్టీ కుర్రలు ఎంత హీనంగా ప్రచారం చేస్తున్నా కానీ జగన్ ఏమాత్రం పట్టించుకోవడంలేదని అసలు డిజిపి ఏం చేస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీలపై ఎద్దేవా చేశారు పంచమర్తి అనురాధ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మొదటిసారి ఆమె మాట్లాడిన మాటలను అందరిని ఆకర్షించాయి.

https://www.youtube.com/watch?v=M57DxwK-46M