Kethi Reddy :ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలలో నిత్యం ప్రజలతో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎవరు అంటే మొదటిగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేరే గుర్తొస్తుంది.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి రోజు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో కాలనీలో పర్యటిస్తూనే ఉంటారు.. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. కుదిరితే అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపిస్తారు.. లేదంటే అధికారులకు చెప్పి ఆ సమస్య పరిష్కారానికి మార్గ నిర్దేశం చేస్తారు. తాజాగా కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఓ అక్క ఓ నాన్నను పలకరించగా మీ ప్రభుత్వంలో మాకు ఏమీ రాలేదంటూ గట్టిగా నిలదీశారు..
కేతిరెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకునే భాగంలో సైడ్ ఆర్మ్ వెయ్యాలి అని ఒక అతను వచ్చి మాట్లాడుతుండగా .. ఒక్క మాట మాట్లాడగానే ఏం తాగుతున్నావు అని అడుగుతాడు. మందు అని అంటాడు. పొద్దున రాత్రి తాగి ఉద్యమం చేస్తున్నావు అంటూ చతుర్రుగా ఆయనను ఒక్కటి పీకుతాడు. సైడ్ ఆర్మ్ ఏపిస్తే గాని మందు తాగడం తగ్గివు.. మొహం చూడు తాగి తాగి ఎట్టా పీక్కుపోయిందో.. అని ముందుకి కదులుతాడు.
ఇక అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఏం అక్క ఏమైనా సమస్య.. పెన్షన్ వస్తుందా అని అడగగా.. అన్ని వచ్చిపోయినాయని ఆమె చెబుతుంది. ఆమె ఒంటరి మహిళ. తండ్రి వద్ద ఆశ్రయం పొందుతుంది. తన తమ్ముడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ దాంతో తన తండ్రికి ఆమెకు పెన్షన్ పోయిందని లబోదిబోమంటుంది. పేరుకే పథకాలు ఇస్తున్నామని పెద్ద పెద్ద పాంప్లెట్లు, బ్యానర్లు వేయించుకుంటూ చెప్పడమే కానీ చేతల్లో లేదంటూ ప్రభుత్వ పరిపాలనపై దూషించింది అయినా కానీ కేతిరెడ్డి ఆ మహిళ మీద రవ్వంత కూడా కోపం తెచ్చుకోకుండా ఆమె చేయి పట్టుకుని .. నేనున్నా కదా అక్క నేను చూసుకుంటా అని చెబుతాడు.
ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తుండగా కేతిరెడ్డి స్వయంగా ఆమె కన్నీళ్లను తుడుస్తాడు. ఎవరికైనా ఆ సమయంలో కోపం వస్తుంది. కానీ కేతిరెడ్డికి కోపం వచ్చే సిచువేషన్ లో కూడా వాళ్లని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకుంటున్నాడు. ఆమె బాధను అర్థం చేసుకొని వెంటనే పెన్షన్ రావడానికి తగు సూచనలను అధికారులకు చెప్పారు. వాళ్లు కూడా చేస్తామని హామీ ఇచ్చారు.