Mekapati Chandra Sekhar Reddy : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం లేకపోయినా గాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనురాధ ఘనవిజయం సాధించింది. వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ ద్వారా నాలుగు ఓట్లు పడ్డాయి. దీంతో అనురాధ 23 ఓట్లతో అనూహ్య విజయం సాధించింది. అయితే మొదటి నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు క్రాస్ ఓటింగ్ కీ పాల్పడతారని డిసైడ్ అయిన వైసీపీ ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరూ వెన్నుపోటు పొడవడం క్రాస్ ఓటింగ్ పాల్పడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఈ నలుగురిని వైసీపీ సస్పెండ్ చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో వైసీపీ కార్యకర్త మాట్లాడిన ఫోన్ కాల్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది.
ఆ ఆడియో కాల్ లో…మేకపాటి మాట్లాడుతూ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున తాను గెలిచిన సమయంలో దివంగత వైయస్సార్ చనిపోయిన వెంటనే నాలుగున్నర సంవత్సరాలు పాటు నాకు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్న జగన్ వెంట నడిచాను. రాజకీయంగా వైఎస్ జగన్ కి నేను ముందు నుండి చాలా తోడుగా ఉన్నాను. నేను ప్రజా బలం కలిగిన నాయకుడిని. అటువంటిది నేను ఆయనను కలిసిన సమయంలో ఎమ్మెల్యేగా ఈసారి గెలవవు… ఎమ్మెల్సీగా టికెట్ ఇస్తానని అందరి ముందు అనటం నాకు ఎంతో బాధ కలిగించింది. ఎమ్మెల్సీ టికెట్ నాకెందుకు. ఎమ్మెల్యే టికెట్ కావాలి. నేను ప్రజలలో ఉండే నాయకుడిని. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వల్లే రాజకీయంగా నేను పైకి వచ్చింది.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ వేయకముందు కూడా వైఎస్ జగన్ ని కలవడం జరిగింది. ఆ సమయంలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఉండదు ఎమ్మెల్సీతో సరిపెట్టుకో అని అన్నారు. అయితే అవతల కార్యకర్త నేను రౌడీషీటర్ ని అనేసరికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. నా పొలిటికల్ కెరియర్ లో పెద్ద పెద్ద పోటుగాలని కొమ్ములేరిచాను అంటూ రిప్లై ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని మొహం మీద చెప్పారు.. ఇంకేం చేయాలి అంటూ తన అసహనాన్ని కార్యకర్త ఫోన్ కాల్ లో బయటపెట్టారు. వైసిపి కార్యకర్తతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.