YS Viveka Case : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ప్రచారం ప్రారంభమైన ముందు జరిగిన ఈ హత్య తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో కావాలని వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించడం జరిగింది. ఇక అదే సమయంలో కావాలనే కడప జిల్లాలో సానుభూతి ఓటు సంపాదించుకోవడానికి వైసీపీ వాళ్లు హత్య చేసినట్లు ఆరోపించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు జరగటం జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయినా గాని ఈ హత్య కేసులో పురోగతి కనిపించింది లేదు.

దీంతో వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైయస్ సునీత.. న్యాయస్థానాలను ఆశ్రయించి సీబీఐ చేత విచారించడం జరిగింది. అయితే సీబీఐ విచారణ దాదాపు ఏడాదికి పైగా జరుగుతున్న.. కేసులో కీలక విషయాలు బయటకు రాకపోవడం వెనుక కొన్ని రాజకీయ కుట్రలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణ చేయడం మరింత సంచలనంగా మారింది. పరిస్థితి ఇలా ఉంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ కేసు విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
ఈ పీటీషన్ నీ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు… కేసులో భయంకరమైన కుట్రలు ఉన్నట్లు హైకోర్టు తీర్పు ఇచ్చిన విచారణలో రాజకీయ కోణాలు అని చూపించి దోషులను పట్టుకోవడానికి ఈ కారణాలు సరిపోవని స్పష్టం చేయడం జరిగింది. 2021 నుండి ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. దర్యాప్తులో ఎటువంటి పురోగతి సాధించలేదు. ఇలాంటి తరుణంలో కేసు దర్యాప్తు చేపడుతున్న సీబీఐ అధికారిని మార్చి మరొక అధికారికి బాధ్యతలు ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం..సీబీఐకీ స్పష్టం చేయడం జరిగింది. దీంతో వైఎస్ వివేక హత్య కేసును మరో కీలక సిబిఐ అధికారి.. టేకప్ చేపట్టబోతున్నారు.