Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన చాలా కాలం తర్వాత మళ్లీ ఒక సినిమా ప్రకటించారు. ఇకపోతే త్రివిక్రంతో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. కారణం మహేష్ బాబు తల్లి, తండ్రి రెండు నెలల వ్యవధిలోనే మరణించడంతో ఆయన ఆ బాధ నుంచి తేలుకోలేకపోయారు. దాంతో సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత రెస్టారెంట్ ఓపెనింగ్, ఆ తర్వాత విదేశాలకు వెళ్లడం అన్నీ అలా సుమారుగా ఫిబ్రవరి వరకు ఆయన సినిమా సెట్ పై కనిపించలేదు.

కానీ ఇప్పుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు.. త్రివిక్రమ్ తో సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలన్న ఒక ఆలోచనతో ఆయన ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళితో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు మహేష్ బాబు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూల పాల్గొన్న మహేష్ బాబు తన భార్య నమ్రత గురించి… ఆమె ఫ్రెండ్స్ గురించి షాకింగ్ కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.
ఇంటర్వ్యూలో భాగంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలపై గాసిప్స్ వస్తూ ఉంటాయి కదా మీ భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గాసిప్ లు చర్చకు వచ్చాయా అని యాంకర్ అడగా.. నమ్రత ముంబై కదా అక్కడి నుంచే ఆమె ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఎక్కువగా గాసిప్స్ వస్తాయి. ఇక ఆ గాసిప్స్ ఎలా అంటే ఒక్కోసారి వాటిని వినలేము.. ఇక నేను కూడా మీకు చెప్పలేను అంటూ తెలిపారు మహేష్ బాబు. ఇకపోతే మహేష్ బాబు చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.