Mahasena Rajesh :వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని.. క్లీన్ స్వీప్ చేయాలని.. నేతలకు దిశా నిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు విషయంలో తేడా అనిపిస్తే వెంటనే వార్నింగ్ ఇస్తూ… టికెట్ ఉండదని చెప్పేస్తున్నారు. ప్రజలలోనే నాయకులు ఉండాలని రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా వైసీపీ నాయకులు ప్రతి ఇంటినీ సందర్శిస్తూ.. వారి దగ్గర జగన్ పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. పథకాలు గురించి ఇంకా పాలన గురించి రకరకాల ప్రశ్నలు అడుగుతూ… అంతా బాగుంటే ఇంటికి మా భవిష్యత్తు నీవే జగనన్న అనే స్టికర్ అతికిస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం పై మహాసేన రాజేష్ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు సంచులు తొడుగుకొని… ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించటంపై మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 108 నియోజకవర్గాలలో క్లీన్ స్వీప్ చేయటంతో జగన్ కి భయం పట్టుకుందని రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రజలతో కాకుండా వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతతో మా నమ్మకం నీవే జగనన్న అని అనిపించగలరా అంటూ సవాలు విసిరారు. పోనీ సునీతతో కాకపోయినా చెల్లి షర్మిలతో లేకపోతే తల్లి విజయమ్మతో అయినా ఈ మాట చెప్పించగలరా అంటూ మహాసేన రాజేష్.. చాలెంజ్ చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు వైఎస్ జగన్ అనేక హామీలు ఇచ్చారు. వాటి గురించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ప్రశ్నిస్తే తనకు తెలియదనే పరిస్థితిలో ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వైసిపి నాయకులు వచ్చి… మా భవిష్యత్తు జగన్ అనే స్టిక్కర్లు అతికించడం చాలా ఎటకారంగా ఉంది అన్నట్టు.. మహాసేన రాజేష్ మండిపడ్డారు. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఉండాలిగానీ ఇలా బలవంతంగా స్టిక్కర్లు అతికించడం అన్యాయమని పేర్కొన్నారు. ఆ సంచులు వైసీపీ నాయకుల అవతారాలు చూస్తుంటే పిల్లలను కిడ్నాప్ చేసుకునే గ్యాంగ్ లాగా ఉందని ఎటకారం చేశారు. నా చిన్న వయసు సమయంలో సంతకి వెళ్లేటప్పుడు అక్కడ సంచులు కొనుక్కునే వాళ్ళం. అదే విధంగా వైసీపీ నాయకులు సంత సంచులు వేసుకొని.. ఇంటింటికి ఇష్టానుసారంగా స్టిక్కర్లు అతికించటం సొంత డప్పు కొట్టుకున్నట్లు ఉందని చెప్పుకొచ్చారు.
https://www.youtube.com/watch?v=dvAiKJsAfC4