Nara Lokesh : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు మన గురువు.. చంద్రబాబు నాయుడు మన రాముడు.. కానీ ఈ లోకేష్ వైకాపా వాళ్ళకి మూర్ఖుడు.. అంటూ యువకులం పాదయాత్రలో లోకేష్ సంచలన కామెంట్స్ చేశాడు.. ఎవరైతే మా అమ్మను ఏడిపించారో వాళ్లని కట్ డ్రాయర్లతో ఊరేగిస్తాను.. మీ అందరికీ తెలుసు మా తాత రాజకీయాల్లో ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు బయటకు రాలేదు అలాగే మా నాన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా అమ్మా ఎప్పుడు బయటకు రాలేదు అలాంటి మా అమ్మని సాక్షుల సభ సాక్షిగా అవమానించారు..

మేము గెలిచిన తర్వాత బాబు గారిని కుర్చి ఎక్కించిన తర్వాత వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెబుతాం.. నేను మళ్ళీ చెబుతున్నాను నేను ఏ రోజు జగన్ రెడ్డి గారి భార్య గురించి గానీ తల్లి గురించి గానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయనకి ఉన్న ఇద్దరు కూతుర్ల గురించి మాట్లాడలేదు. మై డియర్ జగన్ బాబు గారు మాకు నేర్పించిన సంస్కృతి సంప్రదాయాలు అలాంటివి.
కదిరి నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు.. సభకు నమస్కారాలు.. గతంలోని నేను చెప్పాను సహకరిస్తే ఇది పాదయాత్ర లేదంటే దండయాత్ర అని లోకేష్ అన్నారు. మళ్లీ నేను చెబుతున్న వైసీపీ నాయకులకి నేను మూర్ఖుడిని రాముడిని అయితే కాదు. వడ్డీతో సహా వసూలు చేసే వ్యక్తి ఈ లోకేష్ అని అన్నారు.